జగన్ ఐడియా ఇంత ప్రమాదకరమా?

జగన్ ఐడియా ఇంత ప్రమాదకరమా?

ప్రభుత్వ అధినేతగా రాష్ట్ర నిధులును, ప్రజల డబ్బును పొదుపు చేయాలనుకోవడంలో ఏ తప్పు లేదు. అయితే, ఉద్దేశం కూడా మంచిది కావాలి. ఆలోచన కూడా మంచిది కావాలి. అపుడే పొదుపు, పేరు రెండూ సాధ్యమవుతాయి. "చంద్రబాబు తప్పు చేశాడు" అని ఎన్నికల ముందు చేసిన ఆరోపణ నిరూపించడం కోసమే అన్నట్టు జగన్ చేస్తున్న కొన్ని పనులు చంద్రబాబును డ్యామేజ్ చేయకపోగా, జగన్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పీపీఏ విషయంలో జగన్ పరిస్థితితో చీమల పుట్టలో వేలుపెట్టినట్లే ఉంది.

పీపీపీ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్) పరిమిత కాలానికి ఆయా ప్రభుత్వాలు విద్యుదుత్పత్తి సంస్థలతో చేసుకుంటాయి. ఇవి ఎందుకు పరిమితి కాలానికి చేసుకుంటాయంటే... టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ధరలు తగ్గుతు ఉంటాయి. ఆ ప్రయోజనం కోసమే నిర్ణీత కాలానికే అగ్రిమెంట్లు ఇస్తాయి. అందులో బాగంగా చంద్రబాబు హయాంలో పీపీఎలు యూనిట్ ధర 4.84 రూపాయలుగా నిర్ణయించి అగ్రిమెంట్లు చేసుకున్నాయి. కాలక్రమేణా ఉత్పాదక ధర తగ్గినా గవర్నమెంటు మాత్రం అగ్రిమెంట్ ధర చెల్లించాల్సిందే.

అయితే, మేమెందుకు చెల్లిస్తాం, మారుస్తాం అని తాజా ముఖ్యమంత్రి జగన్ మొండికేశారు. దీంతో పీపీఎల్లో అవినీతి లేదు. అవి కేంద్రం నిర్ణయించిన ధర మేరకే జరుగుతాయి, వాటి జోలికి పోవద్దు అని తొలుత కేంద్రం ఒక లేఖ రాసింది. జగన్ వినలేదు. తర్వాత కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ చిన్నగా హెచ్చరిస్తూ మరోలేఖ రాసింది. అయినా జగన్ వినలేదు. తర్వాత 'ఫిచ్ రేటింగ్స్' జగన్ నిర్ణయం పునరుత్పాదక సంస్థలను తీవ్రంగా దెబ్బతీస్తుందని, పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఇది మూడో సారి.

నిన్ననే కేంద్ర సంస్థ ఎన్టీపీసీ ఏపీ గవర్నమెంటుకు లేఖ రాసింది. పీపీఏ ఒప్పందాలు సజావుగానే ఉన్నాయి. ముందు బకాయిలు చెల్లించండి అని లేఖ రాసింది. ఇది జగన్ వ్యవహారంపై నాలుగో తిరస్కారం. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ 'క్రిసిల్' వ్యాఖ్యలతో జగన్ కు ఐదో తిరస్కారం పడినట్టయ్యింది. ఏపీ దేశంలోని పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో 12 శాతం విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోందని, ఏపీ వాడుకునే విద్యుత్తులో 18 శాతం ఈ విద్యుత్తే అని పేర్కొంటూ... ఈ సంస్థలు వేర్వేరు చోట్ల 21000 కోట్ల రుణాలు సేకరించాయని... ఇపుడు గవర్నమెంటు ఈ వ్యవహారాన్ని కెలికితే అవి ఎన్ పీఏలుగా మారి ఆయా సంస్థలను డిఫాల్టర్లుగా చేస్తాయని పేర్కొంది. అయితే, ఈ నష్టం ఇక్కడితో ఆగదని, దేశంలో ఇన్వెస్టమెంట్లపై ప్రభావం చూపుతుందని స్పష్టంగా పేర్కొంది.

మొత్తం వ్యవహారం చూస్తుంటే... ఏపీ సర్కారు పరిస్థితి పీపీఏల విషయంలో ముందుకు పోతే దేశానికి నష్టం వెనక్కు పోతే పార్టీకి నష్టం అన్నట్లుంది. మరి జగన్ ఈ చిక్కుముడి నుంచి ఎలా బయటపడతారు. తన వాదనే కరెక్టు అంటూ ముందుకు పోతారా? అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English