జ‌గ‌న్ ఈ అసంతృప్తులు చ‌ల్లార్చ‌వా...

జ‌గ‌న్ ఈ అసంతృప్తులు చ‌ల్లార్చ‌వా...

ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, అంబ‌టి రాంబాబు, కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, విజ‌య‌చంద‌ర్‌, ల‌క్ష్మీ పార్వ‌తి, య‌ల‌మంచిలి ర‌వి ఇలా చెప్పుకొంటూ పోతే దాదాపు 30 మందికి పైగానే పేర్లు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. అయితే ఏంటి? అనుకుం టున్నారా?  వీరంతా.. కూడా వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. బ‌ల‌మైన గ‌ళం వినిపించారు. ప్ర‌తిప‌క్షం త‌ర‌ఫున అనేక రూపాల్లో చంద్ర‌బాబుపై యుద్ధం చేశారు. జ‌గ‌న్‌ను సీఎంగా చూడ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డాల‌ని ఎన్నో దేవుళ్ల‌కు మొక్కుకున్నారు. అంతేకాదు, జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో ఆయ‌న‌కు సంఘీభావంగా తాము కూడా పాదం క‌లిపిన నాయ‌కులు కూడా ఉన్నారు.

ఇక కొంద‌రు ఇత‌రుల కోసం త‌మ సీట్లు త్యాగం చేశారు. వీరంద‌రికి జ‌గ‌న్ అన్నా మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మీకు ఏదోలా న్యాయం చేస్తాను... న‌న్ను న‌మ్మండి అని వారిని బుజ్జ‌గించారు. ఇక‌, వీరి ఎదురు చూపులు ఫ‌లించాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. అయితే, ఇంత‌టితో వీరి ఆశ‌లు తీరిన‌ట్టేనా? అంటే కాద‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది. వీరంద‌రూ త‌న‌కు ఎంత మేలు చేశారో.. అంత‌కు రెండింత‌లైనా మేలు చేస్తేనే జ‌గ‌న్ నిజమైన నాయ‌కుడు అని అనిపించుకుంటాడ‌నేది వాస్త‌వం. కానీ, ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

జ‌గ‌న్‌కు ఫ్యూచ‌ర్ బెంగ ప‌ట్టుకుంది. వ‌చ్చే 30 ఏళ్ల‌పాటు త‌న‌దే సీఎం సీటు కావాలంటే.. తాను ఇప్ప‌టి నుంచి కీల‌క‌మైన అడుగులు వేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నట్టే క‌న‌ప‌డుతోంది. మ‌రో కొన్నేళ్ల పాటు తానే సీఎంగా ఉండేలా పాల‌న చేస్తాన‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే అతి సాహ‌సానికి కూడా ఆయ‌న తెర‌దీస్తున్నారు. ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక‌.. సానుకూలంగా ద‌క్కే అనేక ప‌ద‌వుల‌ను ఆయ‌న పార్టీ నేత‌లకు, త‌న‌కు సాయం చేసిన వారికి ఇచ్చుకునే అవ‌కాశం ఉన్నా.. ప‌క్క‌కు పెడుతున్నారు.

ఓ వైపు ఇచ్చిన హామీలు అమ‌లు చేసే క్ర‌మంలో.... వ‌చ్చే ఎన్నిక‌లే ధ్యేయంగా ఆయ‌న వేస్తున్న అడుగుల కార‌ణంగా చిన్న పాటి ప‌ద‌వులు ఆశిస్తున్న వారికి కూడా తీవ్ర నిరాశే ఎదుర‌వుతోంది. ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న అనేక నామినేటెడ్ ప‌ద‌వుల‌ను జ‌గ‌న్ ఇంకా ప‌ట్టించుకోలేదు. పైగా ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల్లో 50 శాతం కోటా విధించారు. దీంతో పార్టీకి సేవ చేసిన వారి ప‌రిస్థితి ఏంటి?  పోనీ మంత్రి వ‌ర్గంలో సీటు ల‌భించే ఛాన్స్ ఉందా? అంటే.. అది కూడా లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇలాంటి వారికి త‌గు న్యాయం ఎప్పుడు చేస్తార‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ఇక కొంద‌రు నేత‌ల‌కు రెండు, మూడు ప‌ద‌వులు కూడా ద‌క్కుతున్నాయి. దీంతో ప‌ద‌వులు ఆశించే మిగిలిన నేత‌ల్లో ఇది తీవ్ర‌మైన అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది. పార్టీ నుంచి ఎక్కువ మంది విజ‌యం సాధించ‌డంతో పాటు త్యాగాలు చేసిన వారు కూడా ఎక్కువ మందే ఉండ‌డంతో జ‌గ‌న్‌కు ప‌ద‌వుల పంపిణీ పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ నేత‌ల్లో అసంతృప్తి చ‌ల్లార్చేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల కాన్సెఫ్ట్ కొద్ది రోజులు ప‌క్క‌న పెట్టి పార్టీకి ఉప‌యోగ ప‌డిన వారికి న్యాయం చేయాల‌ని కోరుతున్న‌వారి సంఖ్య పెరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English