కర్ణాటక సమాప్తం... కుమార పతనం

కర్ణాటక సమాప్తం... కుమార పతనం

బీజేపీ కోరిక తీరింది. ప్రజాస్వామ్యం పక్కదారి పట్టింది. కర్ణాటక ప్రభుత్వం కూలింది. అసలు కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇపుడు ఎన్నికలు వస్తే మేలని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఎవరిది న్యాయమో, ఎవరిది అన్యాయమో తెలియని డైలమా ఉంది అక్కడ. చివరకు విశ్వప్రయత్నాల అనంతరం కుమారస్వామి ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టింది. రేపో మాపో కర్ణాటకలో కాషాయ ప్రభుత్వం ఏర్పాటుకానుంది.

 ఈరోజు జరిగిన బల పరీక్షలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ కూటమి ఓడిపోయింది. స్వయంగా సీఎం కుమార స్వామి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయనే ఓడారు. వారం నుంచి కొనసాగుతున్న కర్ణాటక రాజకీయ సంక్షోభానికి దాదాపుగా తెర పడింది. సంకీర్ణ కూటమిలో 15 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఈ సంక్షోభం ఏర్పడింది.

ఈ బల పరీక్షలో మేజిక్ ఫిగర్ 103. కుమార సంకీర్ణ కూటమికి 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి అనుకూలంగా ఏకంగా 105 ఓట్లు పడ్డాయి. దీంతో కుమార సర్కారు బల పరీక్షలో ఓడిపోయిందని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటన చేశారు. ఈ సమావేశాలకు మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.

కర్ణాటక శాసనసభలో సభ్యుల మొత్తం సభ్యుల సంఖ్య 224. హాజరు కాని 18 మందిని తీసేస్తే... సభకు హాజరైన వారి సంఖ్య 206. దీంతో మేజిక్ ఫిగర్ 103 అయ్యింది. బల పరీక్షలో సంకీర్ణ సర్కారుకు 99 ఓట్లు రావడంతో ప్రభుత్వం కూలిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English