జగన్ మహత్యం... మరో బ్యాంకు హ్యాండిచ్చేసింది

జగన్ మహత్యం... మరో బ్యాంకు హ్యాండిచ్చేసింది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగానే... రాష్ట్రానికి వరుస షాక్ లు తగులుతున్నాయి. రాజధాని కూడా లేకుండా ప్రస్థానం మొదలెట్టిన నవ్యాంధ్రకు నూతన రాజధానిగా అమరావతిని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం... దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుల వద్ద నుంచి 34 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది.

ఈ తరహా సేకరణ దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగానే నిలిచిందని చెప్పక తప్పదు. ఇలాంటి తరుణంలో కేంద్రం నుంచి పెద్దగా సాయమేమీ లేకున్నా... నిరాశ చెందని చంద్రబాబు వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, ఏఐఐబీ తరహా బ్యాంకులను రుణాల కోసం అప్రోచ్ అయ్యారు. ఈ క్రమంలో వరల్డ్ బ్యాంకు నుంచి రూ.2 వేల కోట్లు, ఏఐఐబీ నుంచి రూ.2 వేల కోట్ల మేర రుణాలకు అనుమతి వచ్చేసింది.

అదేంటో గానీ... జగన్ సీఎం అయి రెండు నెలలు కూడా తిరక్కముందే... వరల్డ్ బ్యాంకు షాకిచ్చేసింది. అమరావతికి తాను మంజూరు చేసిన రుణాన్ని నిలిపివేస్తున్న వరల్డ్ బ్యాంకు ఇటీవలే సంచలన ప్రకటన చేసింది. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్స్ బ్యాంకు (ఏఐఐబీ) కూడా పెద్ద షాకిచ్చింది. ఏపీకి తాను మంజూరు చేసిన రూ.2 వేల కోట్ల రుణాన్ని నిలిపివేస్తున్నట్లుగా ఆ బ్యాంకు ఇప్పుడు పెద్ద బాంబునే పేల్చింది.

అమరావతిపై జగన్ సర్కారు వైఖరి చూసిన తర్వాతే... అమరావతికి మంజూరు చేసిన రుణాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. అమరావతి నిర్మాణంపై జగన్ సర్కారు వైఖరి చూశాక... మంజూరు చేసిన రుణాన్ని నిలుపుదల చేయడమే మంచిదని ఆ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు వ్యాఖ్యానించిందంటే... పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. టీడీపీ హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాలను చూసిన తర్వాతే వరల్డ్ బ్యాంకు వెనకడుగు వేసిందని చెప్పుకుంటూ వస్తున్న వైసీపీ శిబిరం... ఏఐఐబీ నిర్ణయంపై మరి ఏమంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English