Gulte bulletin: స్టేట్ అప్ డేట్స్ విత్ వన్ క్లిక్

Gulte bulletin: స్టేట్ అప్ డేట్స్ విత్ వన్ క్లిక్

* ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీ కార్యదర్శి నుంచి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి చేరింది. ఆదివారం నాడు ఈ బిల్లును కేంద్ర హోం శాఖకు పంపించే అవకాశం ఉంది.

* పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు పోరాడాలని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో వారికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు పోరాడినట్లే పార్లమెంటులో ఎంపీలు కూడా పోరాటం చేయాలని ఆయన అన్నారు.

* ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో అశోక్ బాబు సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో చేసిన 66 రోజుల సమ్మె కాలాన్ని క్రమబద్దీకరించాలని కోరారు. సోమవారం ఆ విషయాన్ని సమీక్షిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని సమాచారం.

* చాలా కాలంగా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయం గురించి లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ... కిరణ్ కుమార్ రెడ్డి ఇక పార్టీ పెట్టే అవకాశం లేదని, కొత్త పార్టీ పెట్టేందుకు ఇప్పుడున్న సమయం సరిపోదని తేల్చేశారు.

* ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్పార్ సీపీ అధ్యక్షుడు జగన్ తో 55 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారంటూ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యానించారు. అందువల్లే ఆదాల రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకోలేదని అన్నారాయన. ఆనం వ్యాఖ్యలకు ఆదాల ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆనం ఓ జోకర్ అని, ఆ సోదరులు కేవీపీ రామచంద్రరావు శిష్యులని, వాళ్లతో కేవీపేయే ఇలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. కేవీపీ భండార బయటపెట్టి, సమైక్యవాదం అంటోన్న ప్రతి శాసనసభ్యుడినీ ఓటు అడుగుతానని ఆయన అన్నారు.

* రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాయలసీమ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ ఖండిచారు. తొమ్మిదేళ్లు మౌనంగా ఉన్న జైపాల్ రెడ్డి, ఇప్పుడొచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నారని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మూజువాణి ఓటుతో చేసే తీర్మానాలు చెల్లవని కేశక్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని జైపాల్ రెడ్డి, షిండేలు రబ్బర్ స్టాంపులాగా భావిస్తున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

* వైఎస్సార్ సీపీతో సీపీఎం పొత్తు పెట్టుకోవచ్చనే ఊహాగానాలకు తెరతీశారు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్.  రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన... కాంగ్రెస్, బీజీపీయేతర కూటమి ఏర్పాటుఉ ప్రయత్నాలు చేస్తున్నామని, రాష్ట్రంలో పొత్తుల విషయంలో మాత్రం రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటున్నది ఆయన చెప్పారు.

* రాష్ట్ర విభజన జరిగితే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని మంత్రి టీజీ వెంకటేష్ ప్రకటించారు. ఈ నెల మూడో తేదీన సీమాంధ్ర శాసనసభ్యులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని చెప్పారాయన.

* వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డితో తెగదెంపులు చేసుకున్న రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరారు. ఈ రోజు ఉదయం రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ వర్మ ఉన్నారు. ఈ సందర్భంగా... తమ పార్టీలో చేరడానికి నాయకులు బారు తీరి ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పడం విశేషం!

* చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం కోటాలలో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. టీడీపీ పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ సొంతూరు అయిన కోటాలలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పోస్టర్లలో రాష్ట్రమంత్రి గల్లా అరుణ కుమారి ఫొటోలు కూడా పెట్టారు. ఆవిడ కుమారుడు జయదేవ్ గుంటూరు జిల్లా నుంచి టీడీపీ తరఫున ఎన్నికల్లోకి దిగుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వెలియడం చర్చనీయాంశమయ్యింది. అరుణకుమారి కూడా టీడీపీలో చేరతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడిలా పోస్టర్లలో కనిపించడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి.

* ఒకే ప్రాంతానికి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని దామోదర రాజనర్సింహ అన్నారు. విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న టీడీపీ నేత సత్యప్రసాద్ ను పరామర్శించిన ఆయన, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణవాదం వినిపించారు. రాష్ట్రం ఇంకా కలిసి ఉంటుందంటూ సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దు, ఎన్ని అడ్డంకులు వచ్చినా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు.

* కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్య హీరో అంటూ పొగిడినందుకు జగన్ ఎస్పీవై రెడ్డి మీ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సమైక్య శంఖారావంలో భాగంగా నెల్లూరులో పర్యటిస్తోన్న జగన్, ఇతర సీనియర్ నేతలు ఫోన్ చేసి మరీ రెడ్డి మీద కోప్పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

* జగన్ మీద నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు చేశారు. పలువురి దగ్గర తాను వసూలు చేసిన డబ్బును తిరిగి అడుగుతారనే భయంతోనే ఆయన హైదరాబాద్ కు తిరిగి రావడం లేదని, ఆయనగారిని వైఎస్సార్ సీపీ ఓ కుటుంబ వ్యాపారంలా మారిపోయిందంటూ విమర్శలు గుప్పించారు.

* రాష్ట్ర విభజనపై ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో పుట్టానని, స్కూల్లో చదువుకున్నప్పుడు ఆంధ్రరాష్ట్రంలో చదివినట్టు సర్టిఫికెట్ ఇచ్చారని, అరవై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో జీవిస్తున్నానని, రాష్ట్రం విడిపోతే తన డెత్ సర్టిఫికెట్ ఏ రాష్ట్రం నుంచి వస్తుందోనని భయపడాల్సి వస్తోందని ఆవేదన చెందారు రామనారాయణ.

* టీడీపీ ఎంపీ గుండు సుధారాణికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆలేరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

* ప్రతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోందని, మద్యానికి బానిసలవుతోన్నవారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. కంటోన్మెంట్ గ్రౌండ్స్ లో ఈరోజు నిర్వహించిన 'మద్యం బాధిత కుటుంబాలతో సత్యాగ్రహం' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మద్యాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందంటూ ఘాటైన విమర్శలు చేశారు.

* మావోయిస్టు కీలకనేత అనిల్ కుమార్ ను ఒడిశాలోని కోరాపుట్ జిల్లా తలపనికి అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బృందం అరెస్టు చేసింది. అనిల్ తపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఇరవై లక్షల చొప్పున రివార్డును ప్రకటించి చాలా కాలమే అయ్యింది.

* రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తుందని అనుకోవడం లేదని లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావులు అభిప్రాయపడ్డారు. ఆరు నెలల ప్రజా ఉద్యమంలో ఇదే ఆఖరి పోరాటమని, ఫిబ్రవరి 21 వరకు కనుక బిల్లును ఆపగలిగితే ఇక విభజన జరగదని వాళ్లిద్దరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

* ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానమే నడిపిస్తోందని, ఆయనతో పాటు స్పీకర్ వ్యవహార శైలి గురించి కూడా తాను రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి మంత్రులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.

* కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. మొత్తం 31 మంది కార్యవర్గ సభ్యులు ఉండగా... కేవలం 20 మందే ఈ సమావేశానికి హాజరయ్యారు.

* కర్నూలు జిల్లాలో హైటెక్ మాస్ కాపీయింగ్ కు రంగం సిద్ధం చేసిన ముఠా గుట్టు రట్టయ్యింది. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల్లోని ప్రశ్నలకు బ్లూటూత్ ద్వారా సమాధానాలు చెబుతామంటూ గురివిరెడ్డి
గ్యాంగ్ డబ్బలు వసూలు చేస్తోంది. ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వీరి ఆట కట్టించారు.

* లోటుపాట్లు సవరించిన తరువాతే పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి పళ్లంరాజు కోరారు. ఈ దశలో బిల్లును పార్లమెంటులో పెట్టడం ప్రభుత్వానికి సమంజసం కాదని ఆయన అన్నారు.

* సీమాంధ్రకు న్యాయం జరిగేలా పట్టుబడతామని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తాము మొదట్నుంచీ తెలంగాణకు వ్యతిరేకం కాదనే చెబుతున్నామని, ఇరు ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బిల్లు ఉండాలన్నదే తమ కోరికని ఆయన స్పష్టం చేశారు. ఇరు ప్రాంతాల నాయకులతో కలిసి పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 3న గానీ 4న గానీ ఢిల్లీ వెళ్లనున్నారని ఆయన చెప్పారు.

* తాము సమైక్యవాదుల జోలికి పోవడం లేదని జేసీ దివాకరరెడ్డి స్పష్టం చేశారు. నిజమైన సమైక్యవాదులంతా తమకు ఓటెయ్యాలని ఆయన కోరారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్నది సమైక్యవాదం వినిపించడానికేనని ఆయన చెప్పారు.

* జనగాంలో ఆటేమేటిక్ సిల్క్ రీలింగ్ యూనిట్ ను ప్రారంభించేందుకు వరంగల్ వెళ్లిన కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకి చేదు అనుభవం ఎదురయ్యింది. పలువురు తెలంగాణ వాదులు ఆయనను అడ్డుకున్నారు. కావూరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English