జ‌గ‌న్‌కు సారీ చెప్పిన గ‌వ‌ర్న‌ర్‌

జ‌గ‌న్‌కు సారీ చెప్పిన గ‌వ‌ర్న‌ర్‌

ఏపీకి కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్‌ నరసింహన్‌కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా నరసింహన్‌ మాట్లాడుతూ ఏపీలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలని ఆకాంక్షించారు. ఆ వెంట‌నే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్.. ఏపీ సీఎం జగన్‌కు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సారీ చెప్పడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త‌న వీడ్కోలు కార్య‌క్ర‌మంలో మాట్లాడిన గవర్నర్ నరసింహన్ తొమ్మిదిన్నరేళ్లపాటు ఇరు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.  ఏపీ ప్రజలు తన మీద చూపిన ప్రేమను మర్చిపోలేనని గవర్నర్ పేర్కొన్నారు. ``ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తెలిసో.. తెలియక తప్పులు చేసి ఉండవచ్చని.. అందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సీఎం.. నన్ను క్షమించాలి`` అ సభా వేదికగా క్షమాపణలు కోరారు. తన కారణంగా నొచ్చుకున్న అందరికీ సారీ అంటూ.. భావోద్వేగానికి గుర‌య్యారు. దీంతో ఒక్క‌సారిగా స‌భలో ఉద్విగ్న‌వాతావ‌ర‌ణం నెల‌కొంది. కాగా, సీఎం జగన్‌ను తన కుమారుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. కెప్టెన్‌గా జగన్‌ నాటౌట్‌ కాకూడదని నరసింహన్‌ వ్యాఖ్యానించారు. తనకు అహోబిలం నరసింహ స్వామి పేరు పెట్టారని.. ఈ రాష్ట్రానికి ఆ నరసింహుడి అండ ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ,  గవర్నర్‌ నరసింహన్ తండ్రిలా తనను ఆదరించారని చెప్పారు. ఆయ‌న‌కు త‌న మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఆయనతో తనకు పదేళ్ల పరిచయం ఉందని, గొప్ప వ్య‌క్తిత్వాన్ని న‌ర‌సింహ‌న్ సుప‌రిచితుల‌ని కొనియాడారు. కాగా, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగం ఆస‌క్తిని రేకెత్తించింది.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English