బియాండ్ సినిమా - బాహుబలికి అరుదైన గౌరవం

బియాండ్ సినిమా - బాహుబలికి అరుదైన గౌరవం

అంతర్జాతీయ రికార్డులు సృష్టించిన తెలుగు సినిమా బాహుబలికి అరుదైన గౌరవం దక్కింది. అన్ని సినిమాలు శాటిలైట్ ను వాడుకుంటే ఈ సినిమానే శాటిలైట్ వాడుకుంది. ఈరోజు జరిగిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే కదా.

భారతదేశమంతా పండగ చేసుకుంటోన్న ఈ సందర్భంలో బాహుబలికి ఇది స్పెషల్ పండగగా మారింది. ఎందుకంటే ’చంద్రయాన్ 2‘ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఉప గ్రహ వాహక నౌకకు ’బాహుబలి‘ అని నామకరణం చేశారు ఇస్రో సైంటిస్టులు.

ఇస్రో చేసిన ప్రయోగం ప్రపంచ ఖగోళ చరిత్రలోనే ఒక పెద్ద అడుగు. అలాంటి ప్రతిష్టాత్మక ప్రయోగంలో బాహుబలి పేరు వినిపించడం అంటే... అది చిత్ర నిర్మాత దర్శకులకే కాదు, అభిమానులకు కూడా పెద్ద న్యూసే. రాజమౌలి సృష్టించిన ఈ కళాఖండం పేరు విడుదలయినప్పటి నుంచి ’సూపర్ పాజిటివిటీ’తో అనేక రంగాల్లో అందరూ వాడుకుంటున్నారు.

ఆ పేరు పెట్టిన వేళా విశేషము, రాజమౌళి కళాతృష్ణ కలిపి తెలుగు సినిమాలో చెరగని రికార్డును ఆనాడు కలెక్షన్లతో లిఖిస్తే నేడు ఈ గౌరవంతో లిఖించబడింది. శాస్త్ర సాంకేతిక రంగ చరిత్రలో ఇక బాహుబలి ఎన్నటికీ చెరిగిపోని ఒక రికార్డు.

దీని బాహుబలి నిర్మాతలు స్పందిస్తూ ఇస్రోకు థాంక్స్ చెప్పారు. ఇది మా సినిమాకు దక్కిన ప్రత్యేక అరుదైన గౌరవం అని పేర్కొన్నారు.

ప్రభాస్ కూడా దీనిపై స్పందిస్తూ... డార్లింగ్స్ 300 టన్నుల బరువైన చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లి వాహన నౌక పేరు ’బాహుబలి‘ అని పెట్టారు. ఇది అరుదైన గౌరవంగా భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English