రాజ‌కీయ నేత‌ల్ని చంపేయండి..గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌ట‌న‌

రాజ‌కీయ నేత‌ల్ని చంపేయండి..గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌ట‌న‌

మ‌న దేశ స‌రిహ‌ద్దు రాష్ట్రమైన జ‌మ్ముకాశ్మీర్ నిత్యం అనేక సంఘ‌ట‌న‌ల‌తో వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల్లో నిలిచేందుకు ప్ర‌ధానంగా ఉగ్ర‌వాదులు కార‌ణం అవుతుంటారు. అప్పుడ‌ప్పుడూ ఆర్మీ, ప్ర‌జ‌లు సైతం ఈ జాబితాలో ఉంటారు. అయితే, వీరికంటే భిన్నంగా తాజాగా జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ జాబితాలో చేరారు.

ఉగ్ర‌వాదుల‌కు సంచ‌ల‌న పిలుపు ఇవ్వ‌డం ద్వారా ఆయ‌న అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. కొందరి మైండ్ బ్లాంక‌య్యేలా చేశారు. ఇంత‌కీ ఆయ‌న చేసిన కామెంట్ ఏంటంటే...నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే పోలీసులను చంపడం కంటే.. అవినీతి చేసే రాజకీయ నేతల్ని చంపాలని ఏకంగా ఉగ్రవాదులకు సూచించడం.

ఔను. సాక్షాత్తు గ‌వ‌ర్న‌ర్ గారే...చంపేయండి అంటూ ఉగ్ర‌వాదుల‌కు పిలుపునిచ్చారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దూమారమే రేగింది. ఇంత‌కీ ఏ సంద‌ర్భంలో ఆయ‌నీ మాటలు మాట్లాడారో తెలిస్తే మ‌రింత ఆశ్చ‌ర్యపోతారు.

కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. `టెర్రరిస్టులు పోలీసులను చంపుతున్నారు. భద్రతా బలగాలను చంపుతున్నారు. ఎస్‌పీఓలను చంపుతున్నారు.. ఇలాంటి వారిని చంపడం కంటే ప్రజల ఆస్తుల్ని దోచుకునే రాజకీయ నేతల్ని, అవినీతికి పాల్పడే అధికారులపై తమ ప్రతాపాన్ని చూపాలి` అని అన్నారు. కాగా, సాక్షాత్తు గ‌వ‌ర్న‌ర్  ఉగ్రవాదులకు ఈవిధంగా సూచించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారత ప్రభుత్వాన్ని ఏ వ్యక్తి కూడా తుపాకులతో బెదిరించలేరని గవర్నర్ ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో శాంతి కోసం పాల‌కులు, ప్ర‌జ‌లు స‌హా అన్ని వ‌ర్గాలు కృషి చేయాలి అని అన్నారు. కార్గిల్ వీరుల‌ను దేశం ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటుంద‌ని గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English