బాబే టార్గెట్‌... ఎన్టీఆర్ మామ ఏం చేస్తున్నాడంటే...

బాబే టార్గెట్‌... ఎన్టీఆర్ మామ ఏం చేస్తున్నాడంటే...

ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై దశాబ్దాలుగా ప‌గ‌ ఉన్న వారంతా ఇప్పుడు ఆయన్నున టార్గెట్ గా చేసుకుని పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చంద్రబాబు ప్రధాన టార్గెట్‌గా మారిపోయారు.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కు... చంద్రబాబుకు గ్యాప్ ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ సొంత మామ చంద్రబాబును తిట్టినా ఎన్టీఆర్ స్పందించకపోవడంతో గ్యాప్ నిజమేనేమో అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి .

ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామ ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో నార్నెకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. తన పాత శత్రువు చంద్రబాబు ను ఇరుకున పెట్టేందుకు ఇప్పుడు నార్నె సరి కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏపీలో టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి ఎన్టీఆర్ ను ఏపీ అంబాసిడర్ చేయాలని జగన్ భావిస్తున్నారట. దీని వెనుక మామ నార్నె ఉన్నారని తెలుస్తోంది. దీనివల్ల ఇటు చంద్రబాబును ఇబ్బంది పెట్టొచ్చు, టిక్కెట్ దక్కని నార్నెకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని జ‌గ‌న్ కూడా భావిస్తున్నాడని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయంటున్నారు. చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసుకున్న ఎన్టీఆర్ మామ నార్నె ఎన్టీఆర్‌కు ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్ బాధ్య‌త‌లు ఇప్పించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ట‌.

ఎన్టీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌ను ఒప్పించేలా చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్ల‌గా జ‌గ‌న్ కూడా సూత్రాభిప్రాయంగా ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ డెసిష‌న్ ఏంటో...

జ‌గ‌న్ ఎన్టీఆర్‌ను ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక చేయ‌డంలో ట్విస్ట్ లేక‌పోయినా ఎన్టీఆర్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడ‌న్న‌దే బిగ్ స‌స్పెన్స్‌. ఏపీలో టీడీపీకి భ‌విష్య‌త్ లీడ‌ర్ గా ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇపుడు పార్టీలో ఎన్టీఆర్ వంటి వారు ఉంటే బాగుంటుందని కొందరు ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇలాంటి టైంలో జగ‌న్ నుంచి వ‌చ్చిన టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్ ప‌ద‌వి స్వీక‌రిస్తే టీడీపీ వ‌ర్గాల్లో ఎన్టీఆర్‌కు ఇప్పుడున్న క్రేజ్ ముందు ఉంటుందా? అన్న‌ది సందేహ‌మే.

ఏదేమైనా ఈ విష‌యం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపేస్తోంది. ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబును టార్గెట్ చేసే క్ర‌మంలో నార్నె, కొడాలి నాని క‌లిసి ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపాలనుకున్నా వీరి గేలానికి ఎన్టీఆర్ చిక్కుతాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

ఎందుకంటే ఈ నిర్ణయానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటే టీడీపీకి మరో పదేళ్ల తర్వాత అయినా నాయకత్వం వహించగలరు అన్న ప్రచారానికి శుభం కార్డు పడుతుంది. ఇదిలా ఉండగా... ఇదే బ్రాండ్ అంబాసిడ‌ర్ రేసులో ప్ర‌ముఖ బ్యాడ్యింట‌న్ క్రీడాకారిణి పీవి.సింధు పేరు కూడా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English