జగన్ పై వాయిస్ పెంచిన చిన్నమ్మ

జగన్ పై వాయిస్ పెంచిన చిన్నమ్మ

పురంధేశ్వరి ఫోకస్ చంద్రబాబు నుంచి ముఖ్యమంత్రి జగన్ మీదకు మారినట్టుంది ఇటీవల పరిణామాలు చూస్తుంటే ! మొన్నటికి మొన్న మత ప్రాతిపదికన జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆరోపించిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తాజాగా జగన్ కు పలు విషయాల్లో గట్టి వార్నింగ్ ఇచ్చారు.

"ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా" విషయంలో సీఎం జగన్‌ వైఖరి సరికాదని పురంధేశ్వరి విమర్శించారు. హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పినా ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ ఒక్కటే కాదు, జగన్ అనేక నిర్ణయాలను ఆమె వ్యతిరేకించడం గమనార్హం.

అంతేకాదు, జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ వ్యవస్థ పర్యవసానాలు అనూహ్యంగా ఉండబోతాయన్నారు. ఈ వ్యవస్థ వల్ల అనేక మందికి ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె అన్నారు.

ఇప్పటికే ఉపాధి కోల్పోయిన రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇసుక, మట్టి విధానం విషయంలోనూ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేవారు.

ఇసుకపై నిషేధం విధించడం చాలా దారుణాలకు కారణమైందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. చాలామందికి నిర్మాణ రంగంలో ఉపాధి లేకుండా పోయిందన్నారు. వెంటనే ఈ విషయంలో మేల్కోకపోతే ఇదో ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే... పురంధేశ్వరి తన కొడుకు కోసం భర్తను, కొడుకును వైసీపీ పార్టీలో చేర్పించారు. తాను బీజేపీలో ఉంటూ... మరి బీజేపీ ఎదుగుతుందో లేదో, మళ్లీ అధికారంలోకి వస్తుందో లేదో అన్న శంక వల్ల ఆమె ఎన్నికలకు ముందు భర్తను, కొడుకును వైసీపీలో చేర్పించారు.

ఆమె ఈ స్థాయిలో జగన్ పై విరుచుకుపడటం ఇదే తొలిసారి. దీన్ని బట్టి ఆమె కుటుంబం మొత్తం బీజేపీ వైపు చూసే అవకాశాలు గోచరిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English