జగన్ మాట తో #CBNMyRoleModel వైరల్ అయ్యింది

జగన్ మాట తో #CBNMyRoleModel వైరల్ అయ్యింది

జగన్ నోరు జారాడా? ఎపుడు ... ఎక్కడ... అని తరచి తరచి ఆలోచిస్తున్నారా? నోరు జారడం అంటే బాబు గొప్పోడని ఏం అనలేదు. బాబును దూషించబోయి... ఆయన ఘనత మరోసారి ప్రపంచానికి తెలియడానికి కారణం అయ్యారు.

ఇంతకీ ఏం జరిగిందంటే... అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రస్తుత జగన్ ప్రభుత్వం విమర్శలు చేస్తూనే ఉంది. ఆ క్రమంలో జగన్ మాట్లాడుతూ... "అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉంటూ మీరు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం అంటున్నారు... నలుగురికైనా ఆదర్శంగా నిలిచారా?" అంటూ జగన్ విమర్శించారు.

దీనికి సభలో చంద్రబాబు కూడా ఓ కౌంటర్ ఇచ్చి ఇక దాన్ని వదిలేశారు. కానీ... ఈ అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు చంద్రబాబు అభిమానులు. ఎందుకంటే టెక్నాలజీతో మిళితిమైన చంద్రబాబు ఫ్యూచరిస్టిక్ విజన్ ని పొగుడుతూ గతంలో అంతర్జాతీయ ప్రముఖులు కీర్తించిన సందర్భాలు, ఉదాహరణలు ఉన్నాయి.

నలుగురేంటి నాలుగువేల మందికి చంద్రబాబు రోల్ మోడల్ అంటూ నెటిజన్లు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. #CBNMyRoleModel వైరల్ అయిన ఈ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల ట్రెండ్స్లో... అంతర్జాతీయ, జాతీయ అంశాలను కాదని ఈ రాత్రి వరకు టాప్ లో నిలిచింది. శనివారం ఉదయం ట్రెండ్ మొదలైన స్వల్పకాలంలోనే 5 వేల ట్వీట్లు దాటిపోయాయి.

సాయంత్రానికి 15 వేల ట్వీట్లతో ఈ ట్యాగ్ ట్రెండయ్యింది. ఇక బాబు గురించి బిల్ గేట్స్, అంబానీ, రతన్ టాటా వంటి ప్రముఖులు చేసిన కామెంట్స్, పలువురు అంతర్జాతీయ వ్యాపార ప్రముఖులు ఇచ్చిన ప్రశంసలు... ఇలా అన్నీ వీడియో, ఇమేజ్ సహితంగా ఇంటర్నెట్లో ప్రత్యక్ష్యం అయ్యాయి. జగన్ ఏదో బాబును డ్యామేజ్ చేద్దామని ప్రయత్నించబోయి అందరి చేత బాబును మరోసారి కీర్తించేలా చేశారు.
 
మాకు చంద్రబాబు రోల్ మోడల్... మాకు మాత్రమే కాదు, ఎంతో మందికి రోల్ మోడల్ అంటూ సోషల్ మీడియాలో జగన్ ను విమర్శిస్తూ చంద్రబాబును ప్రశంసిస్తూ ట్వీట్లు వెల్లువెత్తాయి. బిల్ గేట్స్, ముఖేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా తదితర దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అరవింద్ పనగారియా లాంటి ఆర్థిక రంగ నిపుణులు, ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థలు, ఉమా భారతి లాంటి సీనియర్ రాజకీయ వేత్తలు ఆయా సందర్బాల్లో చంద్రబాబు విజన్ గురించి ఏమన్నారన్న విషయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

నెటిజన్లు ప్రస్తావించిన ఈ ప్రముఖులంతా చంద్రబాబు గురించి ఆయా సందర్బాల్లో చేసిన వ్యాఖ్యలు, ప్రశంసలు చూసిన సామాన్యులు కూడా చంద్రబాబు అసాధారణ వ్యక్తే అని ఇంకోసారి అనుకునేలా చేసింది ఈ ట్రెండ్.

'చంద్రబాబు ఓ గొప్ప విజనరీ. ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత అరుదైన నేత. భారత్ కు బాబు లాంటి విజనరీలు ఇంకా ఎంతో మంది అవసరం ఉంది' అంటూ బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యను ఒకరు ప్రస్తావిస్తే, హైదరాబాదుకు మైక్రోసాఫ్ట్ ను తెచ్చింది చంద్రబాబే, ఆ క్రెడిట్ ఆయనదే అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యను మరొకరు పేర్కొన్నారు. మరో నెటిజన్ 1999లో మీర్చిన సలహా వల్లే మొబైల్ నెట్ వర్క్ లోకి అడుగుపెట్టామని  ముఖేశ్ అంబానీ  స్వయంగా చంద్రబాబుతో చెబుతున్న వీడియోను ఇంకొకరు పోస్ట్ చేశారు.

వాట్ చంద్రబాబు థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అంటూ మోడీ ఇటీవల ప్రారంభించిన జల్ శక్తి పథకం ... ఇంకుడు గుంతలు చాలా అవసరం అంటే 2000 లో చంద్రబాబు చెబితే నవ్వారని ఇంకొక నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇలా జగన్ తన వ్యాఖ్యలతో మరోసారి చంద్రబాబు గురించి ప్రపంచానికి చాటిచెప్పడానికి కారణం అయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English