కాంగ్రెస్ శిఖరం... షీలా దీక్షిత్ కన్నుమూత

కాంగ్రెస్ శిఖరం... షీలా దీక్షిత్ కన్నుమూత

ప్రముఖ రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ షీలా దీక్షిత్ కన్ను మూశారు. ప్రస్తుతం ఆమె వయసు 81 సంవత్సరాలు. కొంతకాలంగా ఆమె హృద్రోగ సంబంధిత వ్యాధితో  బాధపడుతున్నారు. కొద్ది నిమిషాల క్రితం గుండెపోటుతో మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలు హతాశులయ్యారు. అసలే తీవ్రమైన మార్గదర్శ లోపంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కు షీలాదీక్షిత్ మరణం తీరని లోటు.

15 సంవత్సరాలు పాటు రాజధాని రాష్ట్రం ఢిల్లీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన షీలాదీక్షిత్ బీజేపీ గవర్నమెంట్ కు ముందు వరకు గవర్నర్ గా కూడా పనిచేశారు. తాజాగా ఇటీవల లోక్ సభ ఎన్నికలలో ఆమె ఓటమి పాలయ్యారు. ఆమెపై పోటీచేసిన అభ్యర్థి గెలిచాక ఆమె ఇంటికి వెళ్లి పాదనమస్కారం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

షీలాదీక్షిత్ ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తి. బెంగాల్ కు చెందిన వినోద్ దీక్షిత్ ను పెళ్లాడారు. ఆయన కూడా ఓ రోజు రైలు ప్రయాణంలో గుండెపోటుతో మరణించారు. ఇలా భార్యభర్తలు ఇద్దరు గుండెపోటుతో మరణించడం యాదృచ్ఛికం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English