క‌ర్నాట‌క‌లో గవర్నర్ vs ముఖ్యమంత్రి

క‌ర్నాట‌క‌లో గవర్నర్ vs ముఖ్యమంత్రి

కర్ణాటకలో రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం కొత్త మలుపు  తిరిగింది. డైలీ సీరియ‌ల్ లా రోజుకో కొత్త వివాదం తెర‌పైకి వ‌స్తోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్‌ వజూభాయ్‌వాలా రెండు సార్లు ఆదేశించినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం బేఖాతర్‌ చేసింది.

గవర్నర్ వైఖ‌రిపై ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఇప్పుడే ఆయ‌న‌కు జ్ఞానోదయ మైందని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినందున వ జూభాయ్‌వాలా జోక్యం చేసుకోలేరని కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌–జేడీఎస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో శుక్ర‌వారం సభ కొద్దిసేపు వాయిదాపడింది.

అసెంబ్లీ వాయిదా పడగానే రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్‌ వజూభాయ్‌వాలా రెండో లేఖను రాశారు. 'కర్ణాటకలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యల్ని అరికట్టాలంటే వీలైనంత త్వరగా విశ్వాసపరీక్షను పూర్తిచేయండి. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు మీ మెజారిటీని నిరూపించుకోండి' అని లేఖ రాశారు.

దీన్ని అసెంబ్లీలో చదివిన కుమారస్వామి..గవర్నర్‌ వజూభాయ్‌వాలా అంటే నాకు గౌరవముంది. కానీ ఆయన్నుంచి వచ్చిన రెండో ప్రేమలేఖ మాత్రం నన్ను బాధపెట్టింద‌ని పేర్కొన్నారు. మొత్తంగా కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఇప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌వాలా వైపు మళ్లింది.

కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌వాలా వైపు మళ్లింది. శాసన సభలో కుమారస్వామి సర్కారు బల పరీక్షకు గడువులు విధిస్తూ గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం వివాదాస్పదమవుతోంది.

గ‌వ‌ర‌ర్న‌ర్ వ్య‌వ‌హార శైలిని అధికార ప‌క్షం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. రాజ్యాంగ విలువలు కాపాడ‌టంలో గ‌వ‌ర్న‌ర్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈనేపథ్యంలో శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని గతంలో అరుణాచల్‌ప్రదేశ్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.

కుమారస్వామి సర్కారును ఎలాగైనా పడగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ అన్ని ఎత్తులు వేస్తోంది. ఏదేమైనా బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఫలితంగా విశ్వాస పరీక్ష వా యిదాల మీద వాయిదా పడుతోంది.

కేంద్రం, గవర్నర్‌, స్పీకర్‌, సీఎం, విపక్ష నేత ఎవరి ఆటను వారు రక్తికట్టిస్తున్నారు. బీ జేపీ అధికారంలోకి రావాలంటే కుమార సర్కారును రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ అసెంబ్లీని పు నరుద్ధరించడం మినహా మరో మార్గం లేనట్టు క‌నిపిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English