బీజేపీ గూటికి న‌ల్లారి...ఆయ‌న ప్ర‌క‌టించేశాడు

బీజేపీ గూటికి న‌ల్లారి...ఆయ‌న ప్ర‌క‌టించేశాడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఊహించ‌ని రీతిలో బీజేపీ కండువా కప్పుకోనున్నారా ?  అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ఊహించని నేతలు పార్టీలోకి వస్తున్నారని ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నార‌ని తెలిపారు. ఆయన తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇంకొద్దిరోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో మరో మూడు నెలలు పదవీకాలం ఉండగానే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ఏర్పాటును కిర‌ణ్ వ్య‌తిరేకంగా అధిష్టానం విభజనకే మొగ్గు చూపడంతో కిరణ్‌ సీఎం పదవితో పాటు.. దశాబ్ధాల అనుబంధం ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి.. ప్రజల్లోకి వెళ్లారు. అయితే అప్పటికే విభజన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటం.. విభజన ఆగడం అసంభవమనే భావనకు రావడంతో సీఎంగా ఉండి పార్టీ పెట్టినా... కిరణ్‌ను ఎవరూ విశ్వసించలేదు. దీంతో చివరకు ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే బీజేపీలో చేరేందుకు కిరణ్‌ ప్రయత్నించినట్లు.. ఆ పార్టీ కూడా ఆసక్తి చూపినట్లు ప్రచారం జరిగింది. అయితే మిత్రులు, స్నేహితుల సలహా మేరకు వెనక్కి తగ్గారు. అనంత‌రం తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. అయితే, ఆ పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్న కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న‌దారి తాను చూసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డం, రాష్ట్రంలో కోలుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో కిర‌ణ్ ప‌క్క చూపులు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు బీజ‌పీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని అంటున్నారు. దీని ప్ర‌కార‌మే మాధ‌వ్ ప్ర‌క‌టించార‌ని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇంకొద్దిరోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని ఎమ్మెల్సీ మాధ‌వ్ ప్ర‌క‌టించ‌డం ఇందులో భాగ‌మ‌ని పేర్కొంటున్నారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English