ఐతే రామ్‌ది రాంగ్ డెసిషన్ కాదన్నమాట

ఐతే రామ్‌ది రాంగ్ డెసిషన్ కాదన్నమాట

యువ కథానాయకుడు రామ్‌ను అందరూ ఎనర్జీ స్టార్ అంటుంటారు. అతడి ఎనర్జీ డ్యాన్సుల్లో, ఫైట్లల్లో తెలుస్తుంటుంది కానీ.. దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని క్యారెక్టర్లను పండించిన దర్శకులు చాలా తక్కువమంది. ఐతే ఇప్పుడు పూరి జగన్నాథ్ రామ్ ఎనర్జీని నూటికి నూరు శాతం వాడేశాడు. ఇస్మార్ట్ శంకర్ పాత్రతో మాస్‌కు పూనకాలు తెప్పించేశాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి రామ్ క్యారెక్టరైజేషన్, అతడి పవర్ ఫుల్ పెర్ఫామెన్సే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రామ్ వల్లే ఆ పాత్ర అంత బాగా పండిందని.. పూరికి సరైనోడు దొరికాడని.. అలాగే రామ్‌కు కూడా సరైన సమయంలో సరైన క్యారెక్టర్ తగిలిందని అంటున్నారు. ఐతే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఒప్పుకున్నపుడు మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

గత కొన్నేళ్లలో పూరి ట్రాక్ రికార్డు చూసిన వాళ్లంతా రామ్‌ తప్పు చేస్తున్నాడని అన్నారు. గత కొన్నేళ్లలో రామ్‌కు బ్లాక్ బస్టర్లు లేవు కానీ.. ‘నేను శైలజ’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ లాంటి డీసెంట్ సినిమాలు పడ్డాయి. ఇలాంటి సినిమాలతో ఏదోో అలా బండి లాగించేస్తున్న రామ్.. డిజాస్టర్ల మీద డిజాస్టర్లు తీస్తున్న పూరితో ఎందుకు పెట్టుకుంటున్నాడని అన్నారు. కానీ ఎంతో ఆలోచించి పూరి సినిమాకు ఓకే చెప్పాడు రామ్. క్యారెక్టర్, స్క్రిప్టు విషయంలో పూర్తి సంతృప్తి లభించాకే సినిమా ఓకే చేశాడు. ఐతే ఈ సినిమా ప్రోమోలు రిలీజైనపుడు సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ కనిపించింది. అప్పుడు కూడా రామ్ తన నిర్ణయంపై రిగ్రెట్ అవుతాడనే అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సంచలన ఓపెనింగ్స్‌తో పెద్ద హిట్ దిశగా సాగుతోంది. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఈ సినిమా చేసిన రామ్.. తన నిర్ణయం కరెక్టే అని రుజువు చేశాడు. ఈ సినిమా రామ్ కెరీర్‌ మరో స్థాయికి చేరడానికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English