మ‌న‌వ‌డి టిక్‌టాక్...హ‌ర్ట‌యిన‌ హోంమంత్రి

మ‌న‌వ‌డి టిక్‌టాక్...హ‌ర్ట‌యిన‌ హోంమంత్రి

తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారి వాహనంపై కూర్చొని ఆయ‌న మ‌న‌వ‌డు చేసిన‌ టిక్ టాక్ వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. జీపుపై ఉన్న తన స్నేహితుడిని గౌరవించకపోతే..అతని పీక కోస్తా అనే డైలాగ్స్ తో ఫర్కాన్ అహ్మద్ చేసిన టిక్ టాక్ వీడియో సోష‌ల్  మీడియాలో వైర‌ల్ అయింది. తన మనవడిని హోంమంత్రి మహమూద్ అలీ తీవ్రంగా మందలించారు. తన మనవడు ఫర్కాన్ అహ్మద్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి ఉంటే అతనిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసు ఉన్నతాధికారులకు హోంమంత్రి మహమూద్ అలీ నిర్దేశించారు.

హోంమంత్రి మ‌హ‌మూద్ అలీకి ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనం( టీఎస్ 09 పీఏ9999 )పై ఆయన మనవడు పుర్కాన్ అహ్మద్, అతడి స్నేహితుడుతో కలిసి కూర్చొని టిక్ టాక్ వీడియో చిత్రీకరించారు. సదరు వీడియోలో ఒక బాలివుడ్ సినిమాలో పోలీసు అధికారిని పీక కోస్తామని అత్యంత అవమానకరంగా బెదిరించే ఆడియోకు మ్యాచ్ అయ్యేలా హోంమంత్రి మనవడు, అతడి స్నేహితుడు హావభావాలు వ్యక్తం చేస్తూ టిక్‌టాక్ వీడియో చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దీంతో హోంమంత్రి మహమూద్ అలీ తన మనవడిని మందలించారు.

నిబంధనలకు విరుద్ధంగా తన మనవడు ప్రవర్తిస్తే...తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసు ఉన్నతాధికారులను నిర్ధేశిస్తూ ట్వీట్‌ చేశారు. హోంమంత్రి ట్వీట్‌కు స్పందించిన పోలీసు యంత్రాంగం.. అది డీజీపీ వెహికల్ కాదని.. కానీ.. దీనిపై ఇన్వస్టిగేషన్ చేస్తామని.. త్వరలోనే నోటీసులు పంపిస్తామని ట్వీట్‌లో తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English