రవి ప్రకాష్ ఛానెల్ రెడీ? - పేరు ఖరారు, లక్కీ నెంబరుతో సిద్ధం

రవి ప్రకాష్ ఛానెల్ రెడీ? - పేరు ఖరారు, లక్కీ నెంబరుతో సిద్ధం

రవిప్రకాష్ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచాడు. పతనం నుంచి స్వీయపోరాటంతో కొత్త రాజకీయ మద్దతుతో మళ్లీ నింగిని తాకడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు నెలల క్రితం అలంద మీడియా వ్యవహారంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో టీవీ9లో ఆయనపై వేటు పడింది.

ఆ తర్వాత కేసులు, అజ్జాత వాసం, కోర్టు విచారణ తెలిసిందే. ఎట్టకేలకు సుప్రీం ఆదేశంతో పోలీసులకు లొంగిపోయి విచారణ పూర్తి చేసుకుని కొన్ని రోజుల క్రితమే బెయిలు తెచ్చుకున్నారు.

శరవేగంగా రవిప్రకాష్ కొత్త ఛానెల్ పని మొదలుపెట్టారు. కొందరు టీవీ9 మాజీ ఉద్యోగులు ఆయనతో పాటు ఉన్నారు. ఇప్పటికే పేరు కూడా నిర్ణయించినట్లు ఆయన నమ్మిన బంటు, టీవీ9 మాజీ ఉద్యోగి జకీర్ తెలిపారు. రవిప్రకాష్ కొత్త టీవీపేరు 'టీవీ36' గా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

రవి ప్రకాష్ తాను సీఈవోగా ఉన్న కాలంలో మూఢ నమ్మకాలు, జ్యోతిషాలను వ్యతిరేకించారు. ఆయన తాజాఛానెల్ పేరు గమనిస్తే మాత్రం న్యూమరాలజీని ఫాలో అయ్యి పేరు పెట్టినట్టు అర్థం చేసుకోవచ్చు.

టీవీ9 బ్రాండ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో నెంబరు 9 తనకు కలిసి వచ్చిందని ఆయన నమ్ముతున్నట్లున్నారు. అందకే టోటల్ '9' వచ్చేలా రైజింగ్ నెంబరుతో టీవీ36 అని పేరు పెట్టినట్టు అర్థమవుతోంది. చిత్రమేంటంటే.. ఆయన తన కొత్త టీవీ ఆఫీసును టీవీ 9 దగ్గర్లోనే బంజారాహిల్స్ రోడ్ నెం.2లో తెరుస్తున్నట్టు చెప్పారు.

అయితే, సోషల్ మీడియాలో రవి ప్రకాష్ కొత్త ఛానెల్ వెనుక బీజేపీ మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వారు ఏ కామెంట్ చేయలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English