జ‌గ‌న్ కు బీజేపీ నేత‌ల తాజా వార్నింగ్.. 48 గంట‌ల్లో తీసేయాలి

జ‌గ‌న్ కు బీజేపీ నేత‌ల తాజా వార్నింగ్.. 48 గంట‌ల్లో తీసేయాలి

ఒక పోలీసు ఉన్నతాధికారి అత్యుత్సాహం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చి పెడుతోందా?  జ‌గ‌న్ కు లేని ముద్ర‌ల్ని ఆయ‌న మీద మ‌ర‌క‌లుగా వేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా?  అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. ఏపీ సీఎం జ‌గ‌న్ కు బీజేపీ ధార్మిక సెల్ తాజాగా సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చేసింది.

క్రైస్తువులు.. చ‌ర్చిల ర‌క్ష‌ణ‌కు సంబంధించి విశాఖ న‌గ‌ర క‌మిష‌న‌ర్ ఆర్ కే మీనా జారీ చేసిన ఉత్త‌ర్వుల‌పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ప్ర‌త్యేకంగా ఒక మ‌తానికి సంబంధించిన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలంటూ విశాఖ న‌గ‌ర ప‌రిధిలోని ప్ర‌తి పోలీస్ స్టేష‌న్ కు ఉత్త‌ర్వులు జారీ చేయ‌టాన్ని వారు త‌ప్పు ప‌డుతున్నారు.

హిందువులు వ‌సించే ప్రాంతాల‌కు వెళ్లి కొంద‌రు పాస్ట‌ర్లు మ‌త‌మార్పిడిపై ప్ర‌చారం చేస్తున్నార‌ని.. వారిని అడ్డుకోకుండా ఉండ‌టానికి వీలుగా ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తాజా ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ట్లుగా ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఇత‌ర ప్రాంతాల్లో కూడా ఇదే తీరులో ఉత్త‌ర్వులు ఇవ్వ‌టానికి వీలుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా వారు చెబుతున్నారు. తాజా ఉత్త‌ర్వు చూస్తే.. తాను న‌మ్మే మ‌తాన్ని అనుస‌రించే వారికే ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్ప‌టం దారుణంగా ఉంద‌న్నారు.

అందుకే విశాఖ సీపీ జారీ చేసిన ఉత్త‌ర్వును 48 గంట‌ల్లో ఉప‌సంహ‌రించుకోవాల‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. అస‌లు సీపీ జారీ చేసిన ఉత్త‌ర్వుకు డీజీపీ అనుమ‌తి ఉందా?  ఆయ‌న దృష్టికి వెళ్లిందా? అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్న వారు.. ఇలాంటి అత్యుత్సాహ‌పు ఉత్త‌ర్వుల వెనుక ముఖ్య‌మంత్రి జ‌గన్ ఉన్నారంటూ ఆరోప‌ణ‌లు.. హెచ్చ‌రిక‌లు చేయ‌టం వెనుక రాజ‌కీయ కోణమే త‌ప్పించి వాస్త‌వం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఇలాంటి వాటి విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు అలెర్ట్ గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.   


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English