క్లాస్ఎన్నికల్లో ఓడిన 13 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

క్లాస్ఎన్నికల్లో ఓడిన 13 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

కొత్త జనరేషన్ పాఠశాలలు పిల్లలకు మార్కులు ఎలా సంపాదించాలో నేర్పుతున్నాయి గాని జయాపజయాలను ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పడం లేదు. ఈ లోకంలో మంచి మార్కులు రాకపోయినా బతకడం కష్టం కాదు గాని మానసిక స్థైర్యం లేకపోతే పిల్లలు జీవితాన్ని ఎదుర్కోలేరు.

పిల్లల్లో ఆ స్థైర్యం గాని, ఆత్మవిశ్వాసం గాని కేవలం గురువుల వల్ల మాత్రమే రాదు, తల్లిదండ్రుల పాత్ర చాలా అవసరం. కామన్ సెన్స్, కాన్ఫిడెన్స్ లేకపోతే ఫలితాలు ఎంత దుర్బరంగా ఉంటాయో చెప్పే విచారకరమైన దుర్ఘటన ఒకటి తెలంగాణలో చోటుచేసుకుంది.

యాదాద్రి జిల్లాలోని రామన్నపేటలో క్లాస్ లీడర్ కోసం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయానన్న బాధతో ఓ విద్యార్థి ఏకంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామన్నపేట పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో సాయి చరణ్‌ అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలలో క్లాస్‌ లీడర్‌ ఎంపిక కోసం ఎన్నికలు జరిగాయి. తోటి బాలిక చేతిలో సాయి చరణ్‌ పోటీలో ఓడిపోయారు. బాలిక క్లాస్ లీడర్ గా ఎన్నికయ్యింది.

మరి తోటి పిల్లలు అమ్మాయి చేతిలో ఓడిపోయావురా అని ఎగతాళి చేశారో, లేక తనంతట తానే మనస్థాపం చెందాడో గాని సాయిచరణ్ ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. గరువారం సాయంత్రం రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది. స్కూలు ఎన్నికలు ఒక నిండు ప్రాణాన్ని తీశాయి. 13 ఏళ్ల పిల్లాడిని కోల్పోయిన తల్లిదండ్రుల శోకాన్ని ఎవరూ ఆపలేకపోయారు. వారి రోదన అందరి గుండెలను పిండేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English