లోకేశ్ 'పప్పూ.. జగన్ '420'..

లోకేశ్ 'పప్పూ.. జగన్ '420'..

నువ్వు ఒక‌టంటే.. నేను రెండంటా. నువ్వు రెండు అంటే నేను నాలుగు అన్న‌ట్లుగా ఉంది ఏపీ మండ‌లి వ్య‌వ‌హారం చూస్తే. అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌ల‌కు బ‌దులుగా ఒక‌రిపై ఒక‌రు సెటైర్లు వేసుకోవ‌టంతో పాటు స‌భ‌ను హాట్ హాట్ గా మార్చేసిన వైనం చూస్తే.. ఇది మండ‌లా? జ‌బ‌ర్ద‌స్త్ షోనా? అన్న అనుమానం క‌లిగేలా స‌భ్యుల తీరు ఉంది.

అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం కొత్తేం కాకున్నా.. ఒక‌రిని ఉద్దేశించి ఒక‌రు పంచ్ లు వేసుకున్న తీరు మండ‌లి స‌భ్యుల‌కు.. వాటిని టీవీల్లో చూస్తున్న వారికి వినోదాన్ని ఇచ్చిన‌ప్ప‌టికీ.. విలువైన ప్ర‌జాధ‌నంతో నిర్వ‌హించే స‌భ‌లో వ్య‌వ‌హ‌రించే తీరు ఇదేనా? అన్న క్వ‌శ్చ‌న్ రాక మాన‌దు.

ఏపీ మంత్రి క‌మ్ ఫైర్ బ్రాండ్ అనిల్ యాద‌వ్ వ‌ర్సెస్ మాజీ మంత్రి లోకేశ్ మ‌ధ్య న‌డిచిన మాట‌ల యుద్ధం నాన్ స్టాప్ గా సాగింది. ఇరువురు మాట‌ల్ని రువ్వుకున్నారు. ఎవ‌రూ త‌గ్గ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ధోర‌ణి క‌నిపించింది. ఒక‌విధంగా చెప్పాలంటే ఈ పంచ్ ల ప్రోగ్రామ్ ను షురూ చేసింది మాజీ మంత్రి లోకేశ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

మీ నాయ‌కులు ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు వెళ్లాల‌ని లోకేశ్ అన్న మాట‌ల‌కు ప్ర‌తిగా అర్థ‌రాత్రి చిదంబ‌రం కాళ్లు ప‌ట్టుకున్నార‌ని అనిల్ రిటార్ట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయ‌న చావుకు కార‌ణ‌మైన వైనాన్ని అనిల్ కుమార్ ప్ర‌స్తావించారు.

దీంతో స్పందించిన లోకేశ్‌.. జ‌గ‌న్ పై కేసులు ఉన్న‌ది వాస్త‌వం కాదా? అని క్వ‌శ్చ‌న్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టినా కొంద‌రికి తెలుగులో మాట్లాడ‌టం రావ‌ట్లేద‌ని.. తెలుగుకు ట్రైనింగ్ తీసుకుంటున్న‌ట్లుగా అనిల్ ఎద్దేవా చేస్తే.. తాను అమెరికాలో చ‌దివినందున తెలుగులో ఏదైనా ఒక మాట త‌ప్పు మాట్లాడి ఉండొచ్చంటూ వివ‌ర‌ణ ఇచ్చారు.

త‌న మీద వేసిన మ‌ర‌క‌ను తుడుచుకుంటూనే.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్ మీద బండ వేసే ప్రోగ్రామ్ ను మాత్రం లోకేశ్ వ‌దిలిపెట్ట‌లేదు. తాను తెలుగులో ఒక మాట త‌ప్పు మాట్లాడి ఉండొచ్చు కానీ జ‌గ‌న్ మాదిరి రూ.43వేల కోట్లు దోచుకోలేద‌న్నారు. దీనికి బ‌దులుగా అనిల్ స్పందిస్తూ గూగుల్ లో ప‌ప్పు అని కొడితే లోకేశ్ ఫోటో వ‌స్తుంద‌ని అంటే.. 420 కొడితే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫోటో వ‌స్తుంద‌ని లోకేశ్ రివ‌ర్స్ పంచ్ వేశారు.అంతేకాదు.. నెల్లూరు రౌడీ అని గూగుల్ లో కొడితే అనిల్ ఫోటో వ‌స్తుంద‌న్నారు.

ఇలా ఒక‌రిపై ఒక‌రు మాట‌లు రువ్వుకునే క‌న్నా.. కాసింత ప్ర‌జాస‌మ‌స్య‌ల మీద చ‌ర్చిస్తే బాగుంటుంది క‌దా?  ఇలాంటి షోలు.. ఏదైనా ప్రైవేటు వేదిక మీద వీకెండ్ లో పెట్టుకుంటే ప్ర‌జ‌ల‌కు ఖ‌ర్చు త‌గ్గించినోళ్లు అవుతారుగా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English