రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ - చంద్రబాబు

రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ - చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ హయాంలో విగ్రహాల తొలగింపు అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా...వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ "రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాలంటే చంద్రబాబుకు కడుపు మంట, విజయవాడలో విగ్రహాన్ని చూసి ఓర్వలేక దాన్ని తొలగించిన మహానుభావుడు చంద్రబాబు" అని వ్యాఖ్యానించారు.

ఈ విమర్శకు చంద్రబాబు కౌంటర్ ఇస్తూ వైఎస్ తనకు చాలా మంచి మిత్రుడని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు మంచి స్నేహితుడు అని, ఆయనతో రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే...  'రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్. 1975 నుంచి 1983 వరకు మేమిద్దరం కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర్ రెడ్డి, నేను ఒకే గదిలో ఉండే వాళ్ళం. జగన్‌కు మా స్నేహం గురించి తెలియకపోవచ్చు. వైఎస్‌ఆర్‌తో రాజకీయ విభేదం తప్ప... వ్యక్తిగత వైరం లేదు. అలాంటిది విగ్రహాల తొలగింపుపై నేను ఎందుకు వేరేలా కోరుకుంటాను? ఏదో ఒకటి అనాలని చేసిన విమర్శ ఇది' అని చంద్రబాబు తిప్పికొట్టారు.

దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబుకు పలు విషయాల్లో వైఎస్ సహకరించిన మాట నిజమని చెబుతుంటారు. వాళ్లు రాజకీయాల్లో కలసి పనిచేసిన మాట కూడా నిజమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English