జైలుకెళ్లాల్సిన శ‌ర‌వ‌ణ‌భ‌వ‌న్ అధినేత మృతి!

జైలుకెళ్లాల్సిన శ‌ర‌వ‌ణ‌భ‌వ‌న్ అధినేత మృతి!

క‌ష్ట‌ప‌డి పైకి రావ‌టం.. అత్యున్న‌త స్థానాల‌కు చేర‌టం చాలామంది విష‌యంలో జ‌రిగేదే. కానీ.. దాన్ని నిలుపుకోవ‌టంలోనే స‌మ‌స్య అంతా. కొంద‌రికి వ‌చ్చిన పేరు ప్ర‌ఖ్యాతుల్ని అత్యాశ‌తో ఎంత‌లా చెడ‌గొట్టుకుంటారో చెప్పేందుకు వీలుగా శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ అధినేత 72 ఏళ్ల రాజ‌గోపాల్ ఉదంతాన్నిచెప్పాలి. తాజాగా ఆయ‌న చెన్నైలోని ఆసుప‌త్రిలో గుండెపోటుకు సంబంధించిన చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

ఒక‌వేళ ఆరోగ్యం బాగున్నా.. ఆయ‌న జైలుశిక్ష అనుభ‌వించాల్సి ఉండేది. పేరుకు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా.. అత్యాశ కిలోల కొద్ది ఉండ‌టంతో ఆయ‌న కొంప ముంచేలా చేసింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. స్వ‌యంశ‌క్తితో పైకొచ్చిన రాజ‌గోపాల్ కు.. ఆ స్థానం స‌రిపోలేదు.. మ‌రింత ఎదిగేందుకు ఊహించ‌ని రీతిలో క‌ల‌లోకూడా క‌న‌కూడ‌ని ముష్టి ప్లాన్ వేశాడు.

త‌న ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్న వివాహిత‌ను పెళ్లాడితే త‌న సుడి మొత్తం తిరిగిపోతుంద‌ని.. మ‌రింత ఎదిగిపోవ‌చ్చ‌న్న ఒక జ్యోతిష్యుడి స‌ల‌హాను న‌మ్మి.. ఆమె వ‌ద్ద పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చాడు. అప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న రాజ‌గోపాల్ డీల్ ను ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో.. ఆమె భ‌ర్త‌ను చంపేస్తే.. త‌న‌ను త‌ప్ప‌క పెళ్లాడుతుంద‌న్న దుర్మార్గంతో కిరాయి గూండాల‌తో హ‌త్య చేయించాడు. ఈ కేసు మెడ‌కు చుట్టుకోవ‌ట‌మే కాదు.. హ‌త్య చేయించిన వైనం కోర్టులో రుజువైంది. దీంతో.. అత‌డికి  యావ‌జ్జీవ జైలుశిక్ష‌ విధించారు.

అనంత‌రం అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. తాజాగా మృతి చెందారు. 1947లో తూత్తుకూడిలో పుట్టిన రాజ‌గోపాల్.. వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ దోశ కింగ్ గా పేరు సంపాదించాడు. త‌ర్వాత శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ ను స్థాపించి అంచ‌లంచెలుగా ఎదిగి ప‌లు దేశాల్లో త‌న హోట‌ళ్ల‌ను విస్త‌రించాడు. ఇంతా చేసి.. మ‌రింత ఎద‌గాల‌న్న క‌క్కుర్తితో త‌ప్పుల మీద త‌ప్పులు చేసి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరి మ‌ర‌ణించాడు. మితిమీరిన ఆశ‌తో వినాశ‌న‌మే అన్న విష‌యం రాజ‌గోపాల్ ఉదంతంలో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English