ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ అరెస్టు తప్పదా....!

ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ అరెస్టు తప్పదా....!

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు జగ్గయ్యపేట కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసత్య కథనాలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ జగ్గయ్యపేటకు చెందిన ముత్యాల సైదేశ్వరరావు ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణతో పాటు ఎడిటర్ శ్రీనివాస్ పై గతంలో పరువు నష్టం దావా వేశారు.

ఈ కేసుకు సంబంధించి గతంలో ఎన్నోసార్లు విచారణకు రావాలని కోర్టు నోటీసులు జారీ చేసినా వీరిద్దరు హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు రాధాకృష్ణ - శ్రీనివాస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు బుధవారం వారిద్దరికీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. సైదేశ్వర రావు రెండు సంవత్సరాల క్రితం ఓ భూమిని కొనుగోలు చేసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ భూమి కొనుగోలుపై ఓ కథనం ప్రచురించారు. ఆ కథనం పూర్తిగా అస‌త్యంగా ఉందని ఆరోపిస్తూ సైదేశ్వర రావు జగ్గయ్యపేట కోర్టును ఆశ్రయించారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ్గ‌య్య‌పేట కోర్టు ఎండీ రాధాకృష్ణ - ఎడిటర్‌ శ్రీనివాస్ - జిల్లా ఇన్‌ఛార్జ్‌ మాధవి - స్థానిక విలేకర్లు వెంకట రమేష్ - నాగేశ్వరరావుతో పాటు త‌న‌పై త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన నారాయణం, కృష్ణారావులపై పరువునష్టం కేసు వేశారు.

ఈ క్ర‌మంలోనే ఈ కేసును విచారిస్తోన్న కోర్టు వీరిని కోర్టుకు హాజ‌రు కావాల‌ని అనేక  సార్లు నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎవ్వ‌రూ కోర్టుకు రాక‌పోవ‌డంతో చివ‌ర‌కు కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ను జారీచేసింది. కో

ర్టుకు హాజ‌రు కాని రాధాకృష్ణ‌పై అరెస్టు వారెంటు జారీ అయ్యాక ఆయ‌న త‌ర‌పు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్ వేశారు. అయితే న్యాయమూర్తి దానిని తిరస్కరించారు. మ‌రి ఇప్పుడు రాధాకృష్ణ కోర్టుకు హాజ‌రు కాని ప‌క్షంలో ఆయ‌న్ను పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English