సెలబ్రిటీ శారీ ట్రెండింగ్

 సెలబ్రిటీ శారీ ట్రెండింగ్

ఈ జమానాకు కలిసి సంబరాలు చేసుకోవాలంటే ట్విట్టరుకు మించిన వేదిక లేనట్టుంది. ట్రెండింగ్ మొదలుపెడితే ట్విట్టరు అదిరిపోవాల్సిందే. పిచ్చెక్కించేస్తారు. అయితే, సెలబ్రిటీలు పాలుపంచుకునే ట్రెండ్లు మాత్రం అరుదుగా ఉంటాయి.

భారత సైన్యం విజయాలు, ఉపద్రవాలు, ఇండియాకు క్రెడిట్ దక్కినపుడు, ప్రధాన పండగల్లోనే సెలబ్రిటీలు ట్రెండ్ లో పాలుపంచుకుంటారు. జనరల్ ఫన్ లో సెలబ్రిటీలు వేలు పెట్టడం అరుదే. తాజాగా వారిని ఓ ట్రెండ్ ఆకట్టుకుంది. అదే ‘శారీ ట్విట్టరు‘ మొన్న మొదలైనపుడు సామాన్య మగువలు శారీలో మురిసిపోతూ ట్రెండ్ చేశారు కానీ... తాజాగా దీనికి సెలబ్రిటీ కల వచ్చింది. సెలబ్రిటీ అంటే కేవలం సినిమా వాళ్లు కాదు... అందరూ!

కాశ్మీరు నుంచి కన్యాకుకుమారి వరకు, సినిమా నుంచి స్పోర్ట్స్ వరకు, ఇండియా నుంచి జర్మనీ వరకు ఇలా అందరూ అబ్బ.. శారీ ట్రెండా... సూపర్ నేను రెడీ అంటూ శారీలో ఫొటోలు పెట్టేశారు. ‘ఇజ్రాయిల్ ఇన్ ఇండియా‘ అఫిషియల్ అక్కౌంట్ తన ప్రతినిధులు అందరినీ శారీలో  ఇందులో పోస్ట్ చేయడం విశేషం.

ప్రియాంక గాంధీ ఏకంగా పెళ్లినాటి శారీ ఫొటోను షేర్ చేయగా, అమెరికన్ కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) పలు సందర్భాల్లో తాను చీరలో ఉన్న ఫొటోలు పెట్టారు. ఇజ్రాయిల్ డొప్లొమాట్ అద్వ విల్చిన్ స్కీ శారీలో ఆకట్టుకుంది.

ప్రముఖ జర్నలిస్టులు నిధి రజ్దన్ (ఎన్డీటీవీ), రుబికా లియాఖత్, బర్కాదత్, ఫాయీ డిసౌజా, సోనాల్ కాల్రా (హెచ్.టి.),  ఐపీఎస్ రూప, మరో ఇజ్రాయిలీ డిప్లొమాట్ మాయ కడోష్, ఆస్ట్రేలియన్ హైకమిషనర్ హరీందర్ సిద్దు, గుల్ పనాగ్, నటి, రచయిత దివ్య దత్తా, లావణ్య బల్లాల్ (కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, కర్నాటక), జర్మన్ నటి సుజేన్ బెర్నెట్, యామి  గౌతమ్, అస్సామ్ ఎంపీ గౌరవ్ గగోయ్, రుచి కోక్ చా రచయిత .... ఇలా ఎందరో చీరలో చిరునవ్వులు చిందిస్తూ శారీ ట్విట్టర్ అంటూ సెలబ్రేట్ చేశారు. ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఇందులో పాల్గొనడం విశేషం.

చీర వందల ఏళ్ల క్రితమే ఆవిష్కృతమైన డ్రెస్. కానీ ఇప్పటికీ దాని ప్రభ కోల్పోకపోవడానికి కారణం... ఏ ట్రెండ్ లో అని ఇమిడిపోయే స్టైల్ చీర సొంతం. ఎవరికి ఎంత కావాలంటే అంత దాచుకోవచ్చు. ఎవరు ఎంత చూపించాలనుకుంటే అంత చూపొచ్చు... ఇది చీరకు మాత్రమే చెల్లుతుంది. అందుకే మరో వందేళ్లయిన మగువ కప్ బోర్డ్ లోంచి చీర జారిపోదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English