కియా క్రెడిట్ లేఖ - గుట్టు ఇదేనా ?

కియా క్రెడిట్ లేఖ - గుట్టు ఇదేనా ?

కియా క్రెడిట్ పై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ రచ్చ కు దారితీసింది. ఐదేళ్ల పాటు దానిని మోడీ తెచ్చాడు అని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక తన తండ్రి తెచ్చినట్టు అసెంబ్లీలో చెబుతున్నారు. ఏది నిజమో అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు. అయితే, ఈ రచ్చ వెనుక అసలు గుట్టును బయటపెట్టారు అచ్చెన్నాయుడు.

2007లో కియామోటార్స్ ఏపీలో పెట్టమని అప్పటి సీఎం వైఎస్ కోరారని ఆ వినతి మేరకు ఏపీలో కియా పెట్టారని ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పారు. దీనికి ఆధారం కియా కొద్ది రోజుల క్రితం రాసిన లేఖ. ఆ లేఖ రాసేవరకు ప్రభుత్వంలో పనిచేసిన ఎవరికీ తెలియకుండా ఉండే అవకాశం ఉండదు. మరి ఇపుడు వైఎస్ పేరు తెరమీదకు ఎందుకు వచ్చింది? ఇది బ్రహ్మ రహస్యంగా మారిందిపుడు. కియా మోడల్ వెహికల్ లాంచ్ చేసినపుడు కూడా ఈ మాట చెప్పని కియా సీఈవో ఇపుడు ఇలా లేఖ రాయడం వెనుక ఒక వ్యాపార స్వార్థం ఉందని, దానివల్ల ఇపుడు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు కొట్టుకుంటున్నట్లు అర్థమవుతోంది. అయితే, వారు లేఖ రాసి ఈరోజు వైఎస్ కు క్రెడిట్ ఇవ్వడానికి కారణం ఉంది.

కియా ఎక్కడ పెట్టాలని 2015 నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో కియా వాళ్లు పరిశీలన చేశారు. చివరకు మౌలిక సదుపాయాలు, వాతావరణం పరంగా హిందూపురం ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు ప్రధాన కారణం అయ్యాయి. అయితే, కియా సక్రమంగా నడిస్తే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. అది జగన్ కి ఇష్టం లేదు. అందుకే కియా అనుబంధ పరిశ్రమలు వచ్చేందుకు భూమి విలువను రూ.6 లక్షలుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని జగన్ ప్రభుత్వం రూ.60 లక్షలకు పెంచింది. దీంతో అనుబంధ పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఈ నిర్ణయం వల్ల కియా నిర్వహణ ఖర్చు కూడా పెరిగిపోవడం, చంద్రబాబుకు క్రెడిట్ రావడానికి మేము ఎందుకు సహకరించాలని జగన్ మొండిపట్టు పట్టడంతో కియా సీఈవోకు ఒక ఐడియా వచ్చింది. అదే వైఎస్ఆర్ ఐడియా.

కియా గత చరిత్రను వెతికి వైఎస్ మీటింగ్ లను ఆధారం చేసుకుని అప్పట్లో వైఎస్ ప్రోత్సాహం వల్లే ఏపీకి వచ్చామని లేఖ రాశారు. ఇది జగన్ ను మచ్చిక చేసుకోవడానికి కియా చేసిన ప్రయత్నం. కియా క్రెడిట్ ను వైఎస్ అక్కౌంట్లో వేస్తే జగన్ కి కూడా ఏం అభ్యంతరం లేదు. ఆయనకు క్రెడిట్ ఇవ్వడానికి కియాకు కూడా ఏం అభ్యంతరం కనపడలేదు. అలా కేవలం ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సహకాలు సక్రమంగా కొనసాగడానికి కియా చాణక్యమే ఆ లెటర్. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తంచేశారు. తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి కియా లేఖ రాసిందే తప్ప... వైఎస్ కి కియాకు సంబంధం లేదన్నది అచ్చెన్న అనుమానం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English