వైసీపీకి ఝ‌ల‌క్... ఆ లేడీ లీడ‌ర్ బీజేపీలోకేనా...!

వైసీపీకి ఝ‌ల‌క్... ఆ లేడీ లీడ‌ర్ బీజేపీలోకేనా...!

బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మంత్రానికి అన్ని పార్టీలు విల‌విల‌లాడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నేత‌లు కొంద‌రు  ఇప్ప‌టికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రికొంత మంది ముఖ్య నేత‌లు, సిట్టింగ్ ప్ర‌జాప్రతినిధులు కూడా త‌మ పార్టీలోకి వ‌స్తార‌ని బీజేపీ పెద్ద‌లు చెబుతున్నారు.

ఈ కోవ‌లోకే వైసీపీకి చెందిన మహిళా నేత తోట వాణి చేరారు. త్వ‌ర‌లోనే ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు వ‌స్తోన్న వార్త‌లు వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి తోట వాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓ డిపోయారు. కాగా చినరాజప్ప ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని ఆమె ఇటీవ‌లే కోర్టును ఆశ్రయించారు.

అయితే ఉన్నట్టుండి ఇంత‌లోనే ఆమె వైసీపీని వీడి బీజేపీలో చేరాలని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.  ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం పెద్దాపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా దవులూరి దొరబాబుకు బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతోన్న‌ట్టు స‌మాచారం.

ఈ ఎన్నిక‌ల‌కు ముందే తోట వాణి వైసీపీలో చేరారు. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో వాణి భ‌ర్త న‌ర‌సింహం మంత్రిగా ప‌నిచేశారు. 2014 ఎన్నిక‌ల టైంలో టీడీపీలోకి జంప్ చేసి న‌ర‌సింహం కాకినాడ ఎంపీగా గెలిచారు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి వెళ్లి రాజ‌ప్ప‌ను ఓడించ‌డ‌మే టార్గెట్‌గా ప్ర‌చారం చేశారు.

ఇక ఇంత‌లోనే ఆమె ఎందుకు ?  పార్టీ మారుతున్నార‌న్న‌ది అర్థం కావ‌డం లేదు. ఎన్నిక‌ల్లో ఓడిన ఆమె నానిమేటెడ్ పోస్టు  అడిగినా... వైసీపీ ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజనా చౌదరి ద్వారా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులతో వాణి మంతనాలు జరిపినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఓ బ‌ల‌మైన సామాజిక వర్గానికి చెందిన వాణి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే మాత్రం వైసీపీకి షాక్ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అంతేగాక ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన వ‌ల‌స‌ల భ‌యం తాజాగా వైసీపీకి కూడా తాకిన‌ట్లేన‌ని రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోప‌క్క వాణి వైసీపీకి గుడ్ బై చెబుతారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నా... ఇంత వరకూ తోట వాణి స్పందించక‌పోవ‌డం ఊహాగానాల‌కు బ‌లం చేకూరుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English