సర్వే: కండోమ్సా?... తెలుగు వారు అక్కర్లేదంటున్నారే?

సర్వే: కండోమ్సా?... తెలుగు వారు అక్కర్లేదంటున్నారే?

గర్బ నిరోధమే కాకుండా లైంగిక పరమైన వ్యాధులు సంక్రమణనను ఇట్టే నిలిపేసే కండోమ్స్... ఎయిడ్స్ మహమ్మారి ఎంట్రీ ఇచ్చాక మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. భార్యాభర్తల కలయికలోనూ పిల్లలు వద్దనుకునేవారికి కండోమ్స్ నిజంగానే మహా ప్రసాదంలా మారిపోతున్నాయి.

ఇక వివాహేతర బంధాలు, పెళ్లికి ముందు లైంగిక వాంఛల కోసం అర్రులు చాచే వారికి కండోమ్స్ ఖచ్చితంగా అవసరమన్న వాదన అంతకంతకూ పెరిగిపోతోంది. వెరసి కండోమ్స్ విక్రయాలు కూడా భారీగానే పెరుగుతున్నాయనే చెప్పాలి. ఈ తరహా పరిస్థితి ఇతర దేశాల్లో బాగానే ఉన్నా... భారత్ కు వచ్చేసరికి మాత్రం భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

భారతే అనుకుంటే... అందులోని తెలుగు నేలలో ఈ పరిస్థితి చాలా విభిన్నంగా ఉందని చెప్పక తప్పదు. అసలు శృంగారంలో తాము కండోమ్స్ లాంటి తొడుగులు వాడేది లేదని తెలుగు పురుష పుంగవులు తెగేసి చెబుతున్నారు.

ఈ తెగువ ఎంతదాకా వెళ్లిందంటే... వంద మంది పురుషులను తీసుకుంటే వారిలో కేవలం అర శాతం మంది కూడా కండోమ్స్ వాడటం లేదట. ఈ శాతం ఏపీలో మరింతగా తక్కువగా అర శాతం కంటే తక్కువగా 0.2 శాతం మంది మాత్రమే కండోమ్స్ వాడుతున్నట్లుగా తాజా సర్వే ఒకటి సంచలన విషయాలను వెల్లడించింది.

శృంగారంలో తమకు స్కిన్ టూ స్కిన్ టచ్ మాత్రమే కోరుకుంటున్న తెలుగు పురుషులు... కండోమ్స్ లాంటి తొడుగులు వేసుకుని తమకు కలిగే సుఖాన్ని లేశమాత్రం కూడా తగ్గించుకునేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఆందోళన కలిగించే ఈ వివరాలు... మొన్నటి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదికలో బయటపడ్డాయి.

ఏపీలో 0.2 శాతం మంది మాత్రమే కండోమ్స్ వాడుతుంటే... తెలంగాణలో ఈ శాతం కాస్తంత ఎక్కువగా 0.5 శాతంగా ఉందట. అంటే జనాభా నియంత్రణను ఏనాడో గాలికి వదిలేసిన తెలుగు పురుష పుంగవులు... ఒకవేళ జనాభా నియంత్రణను పాటించాలంటే... అది తమ సతీమణులదేనన్న భావనతో ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.

జనాభా నియంత్రణ సరే... అరక్షిత లైంగిక సంబంధాలతో ఎయిడ్స్ మహమ్మారి పొంచి ఉందన్న మాటలను కూడా మన తెలుగు ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదంటే... పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఇక తెలుగు నేల పరిస్థితి ఇలా ఉంటే... దేశంగా భారత్ పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏమీ లేదనే చెప్పాలి.

దేశంలో కండోమ్స్ వాడుతున్న వారి సంఖ్య కేవలం 5 శాతమేనట. అంటే దేశంలో 95 శాతం మంది కండోమ్స్ వాడటానికి అసలు ఆసక్తి చూపడమే లేదన్న మాట. ఈ ప్రమాదకర పరిస్థితికి కారణాలేమిటని ఆరా తీస్తే... కండోమ్స్ వాడకంపై భారత ప్రజలకు అవగాహన లేదనడానికి కూడా ఆస్కారం లేదట. కండోమ్స్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు దాదాపుగా అందరికీ తెలిసిందేనట.

అయినా కూడా లైంగిక సమరంలో తమకు కలిగే తృప్తిని ఏమాత్రం తగ్గించుకునేందుకు భారత ప్రజలు ప్రత్యేకించి పురుషులు సిద్ధంగా లేరట. ఈ విషయంలో ఏపీ ప్రజలు అందరి కంటే టాప్ లో ఉంటే... తెలంగాణ జనం రెండో స్థానంలో ఉన్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English