బాబు మీ పెంపుడు కుక్క‌ల్ని కంట్రోల్ చేయండి!

బాబు మీ పెంపుడు కుక్క‌ల్ని కంట్రోల్ చేయండి!

అధినేత‌కే  ట్వీట్‌ బాణాన్ని ఎక్కు పెట్టారు విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని. గ‌డిచిన కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్ గా ఉన్న కేశినేని నాని త‌న వ‌రుస పోస్టుల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. పార్టీ పైనా.. అధికార‌ప‌క్ష నేత మొద‌లు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అంద‌రిపైనా పోస్టుల‌లో చెల‌రేగిపోతున్నారు. తాజాగా ఆయ‌న చంద్ర‌బాబుపై చేసిన ట్వీట్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. కేశినేని వ్య‌వ‌హారం ఫైన‌ల్ కు వ‌చ్చిందా? అన్న ప్ర‌శ్న త‌లెత్తేలా చేసింది.

నిన్న బుద్ధా వెంక‌న్న వ‌ర్సెస్ కేశినేని నాని మ‌ధ్య న‌డిచిన ట్వీట్ యుద్ధం తెలిసిందే. ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్ద‌రు తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య న‌డిచిన ట్వీట్ల యుద్ధం పార్టీలో సంచ‌ల‌నంగా మార‌ట‌మేకాదు.. ఏ ద‌శ‌లోనూ ఎవ‌రూ త‌గ్గ‌క‌పోవ‌టం హాట్ టాపిక్ గా మారింది. ఒక‌ట్రెండు ట్వీట్ల‌కే అలెర్ట్ అయి.. ఇద్ద‌రు నేత‌ల్ని బుజ్జ‌గించాల్సిన హైక‌మాండ్ సైతం జ‌రుగుతున్న ప‌రిణామాల్ని నిస్స‌హాయంగా చూస్తుండిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

బుద్దా వ‌ర్సెస్ కేశినేని మ‌ధ్య న‌డిచిన ట్వీట్ల తిట్ల‌దండ‌కం నేప‌థ్యంలో ఈ రోజు కేశినేని నాని అధినేత‌కే ట్వీట్ గురి పెట్టేశారు. చంద్ర‌బాబుగారూ.. మీకు నాలాంటి నేత‌లు పార్టీకి అక్క‌ర్లేదంటే చెప్పండి.. ఎంపీ ప‌ద‌వికి.. పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాను.. ఒక‌వేళ నాలాంటోళ్లు కావాల‌నుకుంటే మాత్రం మీ పెంపుడు కుక్క‌ల్ని అదుపులో ఉంచుకోండి అంటూ ఫైర్ అయ్యారు.

ఇప్ప‌టివ‌ర‌కూ వాళ్ల‌ను.. వీళ్ల‌ను.. పార్టీ పైనా త‌న‌కున్న అసంతృప్తిని న‌ర్మ‌గ‌ర్భంగా విమ‌ర్శిస్తూ.. వ్యంగ్య వ్యాఖ్య‌లు చేస్తూ వ‌చ్చిన కేశినేని.. ఏకంగా అధినేతకే వార్నింగ్ ఇచ్చేసిన‌ట్లుగా పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త కొల‌క‌లంగా మారింది. మ‌రి.. కేశినేని ట్వీట్ పై చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English