చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్

చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. మూడు సార్లు  పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్‌ తో పాటు చంద్రబాబు క్యాబినెట్లో సైతం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య టీడీపీకి రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ పరిస్థితులే తన రాజీనామాకు కారణమని రాజీనామా లేఖలో పట్నం సుబ్బయ్య వెల్లడించారు. ఈ లేఖను జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానీకి, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ-మెయిల్‌ ద్వారా పంపారు.

అయితే.. సుబ్బయ్య రాజీనామాకు వ్యక్తిగత కారణాలేమీ లేవని.. టీడీపీలో ఇక భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు తప్ప ఎవరూ టీడీపీ నుంచి గెలవలేదు.. దీనిపై చంద్రబాబు సమీక్ష కూడా జరిపారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఇప్పుడు సుబ్బయ్య రాజీనామా చేశారు. మొన్నటి ఎణ్నికల్లో చంద్రబాబు మెజారిటీ కూడా భారీగా పడిపోయింది. ఇవన్నీ టీడీపీ పతనానికి సూచనన్న భావనలో చిత్తూరు టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది. ఆక్రమంలోనే  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనతో చాలామంది ఇతర పార్టీల్లోకి వెళ్లాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు సొంత జిల్లాకే చెందిన ఓ మాజీ ఎంపీ కూడా బీజేపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారని వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆయన త్వరలోనే కాషాయ జెండా కప్పుకొంటారని వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English