ఆమ్ర‌పాలికి జాక్‌పాట్‌...

ఆమ్ర‌పాలికి జాక్‌పాట్‌...

ప్ర‌ధాన స్ర‌వంతి మీడియాతో పాటుగా సోష‌ల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో పాపుల‌ర్ అయిన ఐఏఎస్ అధికారి ఆమ్ర‌పాలి కాట‌కు జాక్‌పాట్ తగిలింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి బృందంలో ఆమ్ర‌పాలి చేరనున్నారు. కిషన్ రెడ్డి ప్రైవేట్ కార్యదర్శిగా ఆమ్రపాలిని నియమించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. ఆమ్రపాలితో పాటు మరో అధికారి  కె.శశికిరణాచారి అడిషనల్‌ పీఎస్‌గా వెళ్లనున్నారు. ఆమ్రపాలి ప్ర‌స్తుతం జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్నారు.

కిష‌న్‌రెడ్డి బృందంలో ప‌నిచేసేందుకు  తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పేర్లను పరిశీలించిన హోం మంత్రిత్వశాఖ జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌లుగా ఉన్న ఆమ్రపాలిని ఓఎస్డీగా, శశికిరణాచారిని హైదరాబాద్‌లో అదనపు ప్రైవేటు కార్యదర్శిగా, ఐపీఎస్‌ అధికారి ఉత్తర మండల డీసీపీ ఏకేఝాను ప్రైవేటు కార్యదర్శిగా ఖరారు చేసింది. ఈ మేర‌కు వీరిని డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. వీరికి తెలంగాణ ప్రభుత్వం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.

గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి బదిలీపై జీహెచ్ఎంసీకి వచ్చి అడిషనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే తన బ్యాచ్‌మేట్ అయిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను ఆమ్రపాలి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన స్వస్థలం ఢిల్లీ. ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. తాజా పోస్టింగ్‌తో ఢిల్లీలో కుటుంబ స‌మేతంగా విధులు నిర్వ‌హించుకునే అవ‌కాశం ద‌క్క‌నుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English