నిజంగా.. జేసీ చెప్పిన‌ట్టే వైసీపీలో జ‌రుగుతోందా...?

నిజంగా.. జేసీ చెప్పిన‌ట్టే వైసీపీలో జ‌రుగుతోందా...?

రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం కొలువు దీరింది. అఖండ మెజారిటీతో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎం అయ్యారు. మొత్తంగా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు న్యాయం చేస్తూ.. ఆయ‌న మంత్రి వ‌ర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలోను, బ‌య‌ట కూడా ఎక్క‌డా ఈ సామాజిక వ‌ర్గాన్ని త‌క్కువ చేశారు! అనే మాట రాకుండా ఆయ‌న వ్య‌వ‌హరించారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో ప్ర‌క్షాళ‌న‌కు నాంది ప‌లికారు. ప్ర‌తి శాఖ‌లోనూ ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఎక్కడిక‌క్కడ విచ్చ‌ల‌విడిగా పేట్రేగి పోతున్న లంచావాతురుల్ని క‌ట్ట‌డి చేస్తాన‌ని చెప్పారు. త‌న పార్టీ అయినా స‌రే.. మ‌రిం త క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో అటు కాంట్రాక్ట‌ర్ల నుంచి ఇటు, కొన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల నుంచి వ‌చ్చే లంచాలు, క‌మీష‌న్ల‌కు ప్ర‌భుత్వం పూర్తి గా అడ్డుక‌ట్ట వేసింది. అయిన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే పోలీసు అధికారి బ‌దిలీ విష‌యంలో జోక్యం చేసుకుని రూ.10 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్టు వార్త‌లు రావ‌డంతో జ‌గ‌న్ వెంట‌నే స్పందించారు. వెంట‌నే దీనిపై విచార‌ణ చేపట్టి.. ఆ మొత్తాన్ని.. సంబంధిత అధికారికి తిరిగి అప్ప‌గించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇక‌, రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు సంబంధించి స‌బ్ రిజిస్ట్రార్ ల బ‌దిలీ విషయంలో నేరుగా రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కే రూ.కోటి లంచం ఇచ్చేందుకు రెడీ అయిన అధికారిని లూపులైన్‌లోకి నెట్టారు. ఇలా.. జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటూ.. రాష్ట్రంలో పార‌ద‌ర్శ‌క పాల‌న అందించేందుకు కృషి చేస్తున్నారు. అయితే.,. తాజాగా జ‌గ‌న్ పాల‌న‌పై స్పందించ‌న‌ని చెబుతూనే స్పందించిన అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి చేసేందుకు వైసీపీ నాయ‌కులు ఆవురావురు మంటున్నార‌ని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ ను చూసి భ‌య‌ప‌డుతున్నార‌ని లేక పోతే.. అంతే సంగ‌తులని, అప్పటికే నెల రోజులు గడిచిపోయాయ‌ని నాయ‌కులు తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి జేసీ చెప్పిన‌ట్టు ప‌రిస్థితి ఏమీలేద‌ని అంటున్నారు త‌ట‌స్థులు. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంద‌ని, నాయ‌కులు కూడా ఎక్క‌డిక‌క్క‌డ జ‌గ‌న్ మార్గంలోనే న‌డ‌వాల‌ని చూస్తున్నార‌ని, ఈ క్ర‌మంలో పార‌ద‌ర్శ‌క‌త‌కే పెద్ద పీట వేస్తున్నార‌ని చెబుతున్నారు. కేవ‌లం జేసీ.. మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించాల‌నే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English