విజయసాయిరెడ్డి జ్ఞానం బయటపడిపోయింది

విజయసాయిరెడ్డి జ్ఞానం బయటపడిపోయింది

వైసీపీలో విజయసాయిరెడ్డి అంటే మేధావిగా పేరు. కానీ, పార్లమెంటుకు సంబంధించిన అంశాల్లో ఆయనకు కొన్ని ప్రాథమిక అంశాలపైనా పట్టులేదని తాజాగా రుజువైంది. తెలియక చేశారో, తెలివిగా చేశారో కానీ శుక్రవారం విజయసాయిరెడ్డి చేసిన ఒక విచిత్ర వాదన ఆయన అజ్ఞానాన్ని బయటపెట్టింది.

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్, సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ, ఆర్జేడీ పార్టీలు మద్దతు పలికాయి. దీనిపై ఓటింగ్ నిర్వహించాలంటూ విజయసాయిరెడ్డి పట్టుబట్టారు. అయితే, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి, సభలో సగం మంది సభ్యులు ఉండాలని ప్రభుత్వం వాదించింది. దీనిపై ఓటింగ్ కూడా సాధ్యం కాదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని విజయసాయిరెడ్డికి సూచించారు. కేంద్ర మంత్రి ప్రతిపాదనను విజయసాయిరెడ్డి తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 60 శాతం మంత్రి పదవులు బీసీలు, వెనుకబడినవర్గాలకే ఇచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు. అయినా, బిల్లు పెట్టిన సమయంలో అభ్యంతరం తెలపని కేంద్ర ప్రభుత్వం.. ఓటింగ్ సమయంలో అడ్డుపడడాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

ప్రయివేటు బిల్లు పెట్టినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించడం రాజ్యసభలోని సీనియర్ సభ్యులకు నవ్వు తెప్పించింది. ఓటింగ్‌కు ఎందుకు అవకాశం లేదో మంత్రి స్పష్టంగా చెప్పాక కూడా విజయసాయిరెడ్డి అడ్డగోలుగా వాదించడంపై సభలో చర్చనీయమైంది.

ఇంతకీ ప్రైవేటు మెంబర్‌ బిల్లు అంటే ఏంటి..?

మంత్రులు కాని సభ్యులను ప్రైవేటు మెంబర్లుగా పిలుస్తారు. సాధారణంగా ప్రభుత్వ విధానాలపై మంత్రులే బిల్లులు ప్రవేశపెడుతుంటారు. కానీ, నిర్దిష్టఅంశంపై ఏ ఎంపీ అయినా ప్రవేశపెట్టే వీలున్న బిల్లును ప్రైవేటు మెంబర్‌ బిల్లు అంటారు.

శుక్రవారం మాత్రమే ఇలాంటి బిల్లులను అనుమతిస్తారు. సాధారణంగా ఇలాంటివి చర్చకు రావు.

కాగా, 1956లో ఇలాంటి 6బిల్లులు ఆమోదం పొందగా, చివరిసారిగా 1970లో సుప్రీంకోర్టు (ఎన్‌లార్జ్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ అప్పిలేట్‌ జూరిస్‌డిక్షన్‌)బిల్లు-1968 చట్టరూపం దాల్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English