మంత్రి పదవి దక్కని వైసీపీ సీనియర్ బీజేపీలోకి!

మంత్రి పదవి దక్కని వైసీపీ సీనియర్ బీజేపీలోకి!

తెలుగురాష్ట్రాలపై కన్నేసిన బీజేపీకి మరో కీలక నేతను పార్టీలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన ఆ నేత సీనియర్ అయినప్పటికీ మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిత్వశాఖలు చేపట్టిన ఈ ఉత్తరాంధ్ర నేతపై అదే సమయంలో  అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.

రాష్ట్ర విభజన అనంతరం మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన ఆ మాజీ మంత్రిని జగన్ అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదట. దీంతో వైసిపి ప్రభుత్వం ఏర్పడినా కూడా పట్టు సాధించడానికి అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆవేదన చెందుతున్నారు. దీంతో ఆయన బిజెపి వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.

నిజానికి ఉత్తరాంధ్రలో బీజేపీ ఏమంత బలంగా లేదు కానీ రాజకీయంగా మంచి అనుభవం ఉన్న ఇలాంటి నాయకులు చేరితే బిజెపి బలపడడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుందని ఆ పార్టీ ఆలోచన. ఆ క్రమంలోనే ఈ వైసీపీకి చెందిన సీనియర్ నేతను చేర్చుకోవాలని ఉద్దేశంతో బిజెపి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బిజెపి నుంచి ఆ నేత ప్రతిపాదనలు వెళ్లాయని.. ఆయన కూడా సానుకూలమైన ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.

అయితే ఆ సీనియర్ లీడర్ ని తీసుకోవడానికి బీజేపీలను కొన్ని వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్తున్నారు వైయస్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలు ఉండడం ఇప్పటికీ ఆ కేసులు ఆయన వెంటాడుతుండడంతో అలాంటి అవినీతి లీడర్‌ను పార్టీలో చేర్చుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది అని బిజెపిలో ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది కానీ రాష్ట్రానికి చెందిన బీజేపీ పెద్దలు మాత్రం ప్రధాన పార్టీల నుంచి ఏ స్థాయి నాయకులు వచ్చిన ఎవరు వచ్చినా కూడా మొదటి తీసుకొని పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదంతా జరిగి ఆ ఎమ్మెల్యే బీజేపీలో చేరితో వైసీపీ బిజెపిల మధ్య భారీ అగాధం ఏర్పడడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English