అలాంటి వాడు మన పార్టీలో ఒక్కడుంటే చాలు.. కన్నడ లీడర్ పై మోడీ కన్ను

అలాంటి వాడు మన పార్టీలో ఒక్కడుంటే చాలు.. కన్నడ లీడర్ పై మోడీ కన్ను

కర్ణాటకలో కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే స్థితిలో ఉన్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు దేశమంతా ఆసక్తి కలిగిస్తున్నాయి. దేశంలోని అనేక రాజకీయ పార్టీలు కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై కన్నేసి ఉంచాయి ఇదే సమయంలో బిజెపి కూడా కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయం ఆలోచిస్తుండడంతో పాటు..  ఈ సంక్షోభం నుంచి మరో ప్రయోజనం కూడా పొందే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దిల్లీకి చెందిన బీజేపీ పెద్దలు కర్ణాటక రాజకీయ పరిణామాల నుంచి బీజేపీకి అవసరమైన ఓ నేతను గుర్తించినట్లు చెబుతున్నారు. ఆ నేత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో ఆయన ఎట్టి పరిస్థితుల్లో బిజెపి లోకి తేవడానికి ప్రయత్నించారని బీజేపీ పెద్దలు కర్ణాటక బిజెపి నేతలు చెబుతున్నారు.

దిల్లీ బీజేపీ పెద్దలు అంతగా ఆకట్టుకున్న వ్యక్తి ఇంకెవరో కాదు.. కాంగ్రెస్కు చెందిన లీడర్, సంకీర్ణ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేస్తున్న డీకే శివకుమార్.  శివ కుమార్‌కు  బీజేపీ పెద్దలు అంతగా ఎట్రాక్ట్ రావడానికి కారణాలు కనిపిస్తున్నాయి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. కన్నడ కాంగ్రెస్‌, జేడీఎస్‌లలో దేవగౌడ, సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే వంటి నేతలున్నా.. వారెవరూ ఏమీ చేయలేకపోయిన పరిస్థితుల్లో ఎమ్మెల్యే జారిపోకుండా చూస్తూ బిజెపి ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకున్నారు శివకుమార్.

తమిళనాడు, పాండిచ్చేరి, హైదరాబాదులలో క్యాంపులు ఏర్పాటు చేసి కుమారస్వామికి సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మళ్లీ ఇప్పుడు కుమారస్వామి ప్రబుత్వాన్ని కాపాడేందుకు డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. ఆయన ముంబైలో చేసిన హడావుడి, ఎమ్మెల్యేలతో మంతనాలకు చేసిన ప్రయత్నాలను దేశమంతా చూసింది. ఈ ప్రయత్నంలో ఆయన విఫలమైనా కూడా ఆయన వ్యూహాలు, పట్టుదల, ఎక్కడ సమస్య ఉంట అక్కడ వాలిపోవడం వంటి లక్షణాలు కేంద్రంలోని బిజెపిని ఆకర్షించినట్లుగా తెలుస్తోంది. ట్రబుల్ షూటింగ్ లో శివకుమార్ చూపిస్తున్న చొరవ బిజెపి పెద్దలను ఆకర్షించిన తెలుస్తుంది.

శివకుమార్ ఏమీ తన కోసం ఇవ్వన్నీ చేయడం లేదు.. కాంగ్రెస్ మిత్ర పార్టీగా ఉన్న జేడీఎస్ నేతను సీఎం కుర్చీలో ఉంచడానికి ఈ ప్రయాస పడుతున్నారు. సీఎం కుర్చీ కోసం చూస్తున్న బిజెపి నేత యడ్యూరప్ప కూడా ఇంతలా రాజకీయం చేయలేకపోతున్నారన్నది బీజేపీ పెద్దల మాట. సంక్షోభాల నుంచి గట్టెక్కించే సామర్థ్యాలున్న శివకుమార్ వంటి నాయకుడు బీజేపీలో ఉంటే కర్ణాటకలో పాగా వేయడం కష్టం కాదని బీజేపీ అనుకుంటోందట. ఈ నేపథ్యంలోనే శివకుమార్ పార్టీలోకి తీసుకు మార్గాలున్నాయని పరిశీలించాల్సిందిగా బీజేపీ పెద్దలు సూచిస్తున్నారట. అయితే... పార్టీ పట్ల చాలా కమిట్మెంట్తో పనిచేసి శివకుమార్ ని బీజేపీ లోకి రావడం మాత్రం అంత సులభమైన పని కాదు అని కన్నడ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English