ఇండియా ఓడింది... బెట్టింగ్ రాయుళ్లు గుల్ల‌య్యారు

ఇండియా ఓడింది... బెట్టింగ్ రాయుళ్లు గుల్ల‌య్యారు

ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో టోర్నీ ఆరంభం నుంచి విజ‌య‌యాత్ర కంటిన్యూ చేస్తూ వ‌చ్చిన టీం ఇండియా జైత్ర‌యాత్ర సెమీఫైన‌ల్లో ముగిసింది. అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో 18 ప‌రుగులు తేడాతో ఓడిపోయింది. ముందునుంచి ఈ మ్యాచ్‌లో ఇండియా తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే కీవీ బౌల‌ర్ల నుంచి త‌డిసిన పిచ్‌పై అనూహ్య ప్ర‌తిఘ‌ట‌న రావ‌డంతో పాటు కివీల ఫీల్డింగ్‌, బౌలింగ్ నైపుణ్యం ముందు ఇండియా త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఇదిలా ఉంటే ఇండియా గెలుపుపై ముందు నుంచి ధీమాతో ఉన్న క్రికెట్ అభిమానుల‌తో పాటు బెట్టింగ్ రాయుళ్లు భారీ ఎత్తున పందేలు కాశారు.

ఈ బెట్టింగ్ వేసే వారి బ‌ల‌హీన‌త‌ల‌ను క్యాష్ చేసుకునేందుకు బుకీలు భారీగా పందేలకు ఊసిగొల్పారు. బుకీలు అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్‌ల‌తో క‌లిసి మ‌రీ పందేల‌కు దిగి కోట్లాది రూపాయ‌లు లాభం పొందారు. ఒక్క ఢిల్లీతో పాటు స‌మీప ప్రాంతాల్లోనే రూ.150-200 కోట్ల వ్యాపారం జ‌రిగింద‌ని లెక్క‌లు వేస్తున్నారు. దేశ రాజధాని ప్రాంతంలోని ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, నోయిడా, గురుగ్రామ్‌లలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగింది

ముందునుంచి ఇండియా గెలుపుపై ఉన్న ధీమాతో ఒక‌టికి రూ.10 వ‌ర‌కు ఇచ్చి మ‌రీ దారుణంగా న‌ష్ట‌పోయారు. అంటే టీమిండియా గెలుపుపై కేవలం రూ. 4.35 బెట్‌ నిర్వహించిన బుకీలు న్యూజిలాండ్‌పై ఏకంగా రూ. 49 పందెం కాసినట్లు తెలుస్తోంది. ఇండియా గెలిస్తే వ‌చ్చేది రూ. 4 చిల్ల‌ర అయితే.. ఓడితో మాత్రం వాళ్లు రూ.49 వ‌ర‌కు స‌మ‌ర్పించుకోవాల్సిందే. ఈ లెక్క‌న ఇండియా గెలుపుపై బెట్టింగ్ కాసిన వారు భారీగా న‌ష్ట‌పోయారు.

ఇండియా గెలుపుపై విద్యార్థులు, చిన్న వ్యాపార‌వేత్త‌లు, బ‌డా బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల నుంచి రాజ‌కీయ నేత‌లు చాలా మంది బెట్ వేసి జేబులు గుల్ల చేసుకున్నారు. మొన్న జ‌రిగిన ఐపీఎల్‌లో కూడా ఇదే త‌ర‌హాలో బెట్టింగ్ రాయుళ్ల ఆశ‌లు చాలా మ్యాచ్‌ల‌లో రివ‌ర్స్ అయ్యాయి. ఫైన‌ల్లో ముంబాయి గెలుపును ఊహించ‌ని వారు ఓడిపోతుంద‌ని భారీగా పందేలు వేసి జేబులు గుళ్ల చేసుకున్నారు. మ‌రోసారి వీరు ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ ఇండియా గెలుపుపై ధీమాతో ఏకంగా రూపాయికి రూ.10 వేసి బుక్ అయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English