జ‌గ‌న్ జాగ్ర‌త్త‌.. కేసీఆర్ తో పార్ట‌న‌ర్ షిప్ తో ఏపీకి దెబ్బే!

జ‌గ‌న్ జాగ్ర‌త్త‌.. కేసీఆర్ తో పార్ట‌న‌ర్ షిప్ తో ఏపీకి దెబ్బే!

ఐదేళ్ల కేసీఆర్ పాల‌న‌ను తెలంగాణ ప్ర‌జ‌లు ఎంత అర్థం చేసుకున్నార‌న్నది కాసేపు ప‌క్క‌న పెడితే.. నాలుగైదు మీటింగ్ ల‌తోనే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం చాలా బాగా అర్థం చేసుకున్నార‌ని చెప్పాలి. కేసీఆర్ ను.. ఆయ‌న గొప్ప మ‌న‌సును జ‌గ‌న్ మాదిరి అర్థం చేసుకున్నోళ్లు ఉండ‌రేమో?  తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న మాట‌లు వింటే ఆశ్చ‌ర్యంతో అవాక్కు అవ్వాల్సిందే.

ఇరుగుపొరుగు రాష్ట్రాల‌తో స‌ఖ్య‌త ఉండ‌టం త‌ప్పేం కాదు. కానీ.. అలా అని అతిగా పూసుకున్నా ప్ర‌మాద‌మే. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ ఎందుకు మిస్ అవుతున్నార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. గోదావ‌రి నీళ్ల‌ను శ్రీ‌శైలంలో క‌ల‌పాల‌న్న రూ.లక్ష‌న్న‌ర కోట్ల ప్రాజెక్టు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శిస్తున్న అత్యుత్సాహం ఆయ‌న‌కు ముప్పు వాటిల్లేలా చేస్తుందా? అన్న‌ది క్వ‌శ్చ‌న్. దీనికి కార‌ణం లేక‌పోలేదు. అర‌వైఏళ్లు క‌లిసి ఉన్న దానికి ప్ర‌తిఫ‌లంగా రాజ‌ధాని న‌గ‌రాన్ని కోల్పోవ‌ట‌మే కాదు.. ల‌క్ష‌లాది కోట్ల అభివృద్ధి విష‌యంలో వెనుక‌బ‌డిన దుస్థితిలో ఏపీ చిక్కుకుంది.

విభ‌జ‌న జ‌రిగిన తీరును చూస్తే.. ఏపీకి లాభం జ‌రిగేలా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్న విష‌యం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని సంగ‌తి కాదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సిన వ‌స్తుందంటే.. ఒక‌సారి ఉమ్మ‌డి భాగ‌స్వామ్యంలో ఏపీ ఎంత న‌ష్ట‌పోయింద‌న్న విష‌యాన్ని గుర్తు చేయ‌టానికే.

దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఏపీకి చెందిన రాజ‌కీయనేత‌లంతా వ్యాపార‌.. పారిశ్రామిక వ‌ర్గాలకు చెందిన వారే త‌ప్పించి స‌హ‌జ రాజ‌కీయ నాయ‌కులు కాదు. దీని వ‌ల్ల జ‌రిగే న‌ష్టం ఏమంటే.. నేత‌లంద‌రికి వారి వ్యాపార ప్ర‌యోజ‌నాలే ముఖ్యం కానీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కావు.

తెలంగాణ‌లో ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అందుకే వారికి తొలుత రాష్ట్ర ప్ర‌యోజ‌నాల త‌ర్వాతే మిగిలిన‌వి ఏమైనా. ఈ కార‌ణంతోనే విభ‌జ‌న జ‌రిగే వేళ‌లో ఏపీ ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు త‌గిన‌ట్లుగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయార‌ని చెప్పాలి. విభ‌జ‌న జ‌రిగిన ఐదేళ్ల వ్య‌వ‌ధిలోనే మ‌ళ్లీ భారీ ఇరిగేష‌న్ ప్రాజెక్టును రెండు తెలుగు రాష్ట్రాలు క‌లిసి నిర్మించాల‌న్న త‌ప‌న‌ను మొన్న కేసీఆర్ వ్య‌క్తం చేస్తే.. తాజాగా ఏపీ అసెంబ్లీలో జ‌గ‌న్ బ‌ల్ల‌గుద్దిన చందంగా మాట్లాడ‌ట‌మే కాదు.. దీనికి మించి మ‌రో ఆప్ష‌న్ లేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ మాట‌ల‌న్ని ఎలా ఉన్నాయంటే.. ఈ ప్రాజెక్టు లేకపోతే ఏపీకి భ‌విష్యత్తే లేద‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం కనిపిస్తుంది. ఆయ‌న మాట‌ల్ని సావ‌ధానంగా విన్నప్పుడు కొన్ని సందేహాలు క‌లుగ‌క మాన‌వు. జ‌గ‌న్ మాట‌ల్లోని ముఖ్య‌మైన అంశాల్ని చూస్తే.. .

1. గోదావ‌రి నీళ్లు ఎగువ నుంచి దిగువ‌న ఉన్న ఏపీకి రావాలి.

2. అందుకు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి పెద్ద మ‌న‌సుతో ఒప్పుకోవాలి.

3. ఆంధ్రోళ్లు ఏదో పుణ్యం చేసుకున్నారు కాబ‌ట్టి కేసీఆరే స్వ‌యంగా ఈ కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు.

4. తెలంగాణ స‌రిహ‌ద్దుల నుంచి పాపం ఆయ‌న (కేసీఆర్) ముందుకొచ్చి కృష్ణా ఆయుక‌ట్ట స్థిరీక‌ర‌ణ కోసం కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారు

5. మ‌నం అడిగితే పాపం ఆయ‌న స‌రేనని.. మ‌న‌కు చెందిన ఎనిమిది జిల్లాల‌కు నీళ్లు ఇవ్వ‌టం కోసం ఆయ‌న ఒప్పుకున్నారు. ఎంత మంచి మ‌న‌సు.

జ‌గ‌న్ మాట‌ల్ని పాయింట్ల రూపంలో చెప్పుకున్నాం. ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌ల్ని వేసుకోవాలి. ఎగువ నుంచి దిగువ‌కు నీళ్లు ఇవ్వ‌టానికి కేసీఆర్ ఓకే అన్నారు. అంటే.. బాగున్న రోజుల్లో నీళ్లు ఇవ్వొచ్చు. రేపొద్దున రెండు రాష్ట్రాల మ‌ధ్య ఏదైనా లొల్లి వ‌స్తే అంతే సంగ‌తులు చిత్త‌గించ‌వ‌లెన అన్న మాట‌.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English