ఐదేళ్లు మీరు గాడిద‌లు కాశారా బాబు?

ఐదేళ్లు మీరు గాడిద‌లు కాశారా బాబు?

ఏపీలో కొలువు దీరిన కొత్త ప్ర‌భుత్వం నేతృత్వంలో రెండో సారి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. బ‌డ్జెట్ స‌మావే శాల నిర్వ‌హ‌ణ‌కు గురువారం స‌భ స‌మావేశ‌మైంది. అయితే, స‌భ ప్రారంభం నుంచే వైసీపీ, టీడీపీల మ‌ధ్య రాజ‌కీయం తార‌స్థాయికి చేరుకుంది. మాట‌ల తూటాలు పేలాయి. అదే స‌మ‌యంలో విమ‌ర్శ‌ల బాణాలు కూడా సంధించుకున్నారు. అధికార వైసీపీ కానీ, విప‌క్షం టీడీపీ కానీ ఏ ఒక్క విష‌యంలోనూ వెన‌క్కి త‌గ్గ‌క పోవ‌డంతో స‌భ‌ను న‌డిపిస్తున్న స్పీక‌ర్‌కు ప‌రీక్షాకాల‌మే ఎదురైంది.

బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజే. అధికార వైసీపీ మాజీ సీఎం, విప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబును టార్గెట్ చేసింది. న‌ల‌భై ఏళ్ల సీనియార్టీ త‌న సొంత‌మ‌ని చెప్పుకొన్న చంద్ర‌బాబు.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని సాక్షా త్తూ.. సీఎం జ‌గ‌నే స‌భ‌లో విమ‌ర్శల ప‌ర్వానికి తెర‌దీశారు. ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. అంటూ విరుచుకుప‌డ్డారు. ఐదేళ్లు ఆయ‌న అటు కేంద్రానికి, ఇటు ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌కు కూడా భ‌య‌ప‌డి పాల‌న సాగించార‌ని చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. చంద్ర‌బాబుపై సామెత‌లు కురిపించారు. ఐదేళ్లు మీరు గాడిద‌లు కాశారా? అని ప్ర‌శ్నిస్తూనే.. చంద్ర బాబు పాలన అంతా త‌ప్పుల త‌డ‌క‌గా సాగింద‌ని చెప్పుకొచ్చారు. ప‌క్క‌రాష్ట్రంతో చెలిమి చేస్తుంటే చూస్తూ స‌హించ‌లేక పోతున్నా రు అని వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నుంచి కూడాఘాటుగానే కౌంట‌ర్ వ‌చ్చింది. నేరుగా స్పందించిన చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్‌కు త‌న రాజకీయ అనుభ‌వం అంత వ‌య‌సు మాత్ర‌మే ఉంద‌ని, రాష్ట్ర ప్ర‌యోజనాల విష‌యంలో రాజీ ప‌డుతూ.. సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని చెప్పారు. దీంతో ఒక్క‌సారిగా అధికార ప‌క్షం నుంచి ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబు కాళేశ్వ‌రం ప్రాజెక్టును క‌డుతుంటే... క‌ర్ణాట‌క‌లో ఆల‌మ‌ట్టి రిజ‌ర్వాయ‌ర్ ఎత్తును పెంచుతుంటే ఏం చేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో మాట్టాడిన బుగ్గ‌న కానీ, గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి కానీ.. స‌మ‌స్య‌ను మ‌రింత పెంచారు త‌ప్పితే.. ఎక్క‌డా స‌హ‌క‌రించ‌లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మొత్తానికి నువ్వొక‌టంటే.. నే నాలుగంటా! అనే రేంజ్‌లోనే స‌భ సాగ‌డంపై ప్ర‌జాస్వామ్య వాదులు విస్తు పోయారు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English