అమిత్‌షా టూర్‌..తెలంగాణ నేత‌ల‌కు అక్షింత‌లు

అమిత్‌షా టూర్‌..తెలంగాణ నేత‌ల‌కు అక్షింత‌లు

తెలంగాణ‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ భార‌తీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత‌ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామంలోని లంబాడీ సామాజిక వర్గానికి చెందిన జట్వతీ సోనీనాయక్ ఇంటిని ఆయన సందర్శించారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి… వారి ఇంట్లో టిఫిన్ చేసి.. టీ తాగారు. పార్టీ కార్యకర్తలైన ఆ కుటుంబానికి బీజేపీ సభ్యత్వాన్ని అందజేశారు. అనంత‌రం పార్టీ నేత‌ల‌తో క‌లిసి ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తన పర్యటన, రాక సందర్భంగా నేతలు హడావుడి పడుతుండటంతో అమిత్ షా సీరియస్ అయ్యారు. ఒక్క చోటే కాకుండా రెండు ప్రాంతాల్లోనూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రంగనాయక్ తండాలో సోనిబాయి నాయక్ కు బీజేపీ సభ్యత్వ పేపర్ అందజేసే సమయంలో నేతల అత్యుత్సాహం తీరుపై అమిత్ షా అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

అనంత‌రం స్కూల్‌లో మొక్క నాటే సమయంలోనూ నేతల తీరుపై అమిత్ షా కోపడ్డారు. మొక్క నాటిన త‌ర్వాత‌ మట్టి నింపేందుకు అక్కడ రాష్ట్ర నాయకులు పార ఏర్పాటు చేయలేదు. పార తెప్పించేందుకు అప్పటికప్పుడు ప్రయత్నం చేశారు నేతలు. వేరేవాళ్లను పురమాయించారు. దీంతో.. అమిత్ షా కోపం ప్రదర్శించారు. కోపంతో చేతులతోనే గుంతలో  అమిత్ షా మట్టిని నింపారు. కాగా, అమిత్ షా టూర్‌లో నేత‌లు అత్యుత్సాహం అక్షింత‌లు వేయించుకున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

ఇదిలాఉండ‌గా, బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అమిత్‌షా ఈ సంద‌ర్భంగా పార్టీ నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 19 శాతం ఓట్లు వచ్చాయంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో మొత్తం 18 లక్షల మందిని సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేశారు.

పార్టీని బలోపేతం చేయడంలో రాష్ట్ర కార్యవర్గం విఫలం అయినట్టు భావిస్తే .. తానే స్వయంగా రంగంలోకి దిగుతానని తెలంగాణ జిల్లాలన్నిటిలో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని అమిత్‌షా తేల్చిచెప్పారు. ప్రతి బూత్‌లోనూ కార్యకర్తల్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు . సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంగా సాగుతున్న పార్టీని కిందిస్థాయి వరకు తీసుకెళ్లాలన్నారు. ఇప్పటికే దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతం ఓట్లు వచ్చాయని, తెలంగాణలో 50 శాతం వచ్చేవరకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరేయాలన్నారు అమిత్ షా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English