కేంద్రంలో విజయసాయిరెడ్డికి ఇంత పట్టుందా?

కేంద్రంలో విజయసాయిరెడ్డికి ఇంత పట్టుందా?

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలు నెరుపుతారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. విజయసాయికి కేంద్రంలో ఎంత పట్టుందో తెలిపే సంఘటన తాజాగా జరిగింది. ఆయనకు చట్టపరంగా ఇబ్బందులు రాకుండా కేంద్రం ఓ విషయంలో ఆర్డినెన్స్ జారీ చేయడంతో సాయిరెడ్డి ఇంత పవర్‌ఫుల్లా అని వైసీపీ వర్గాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి.

ప్రజాప్రతినిధుల అనర్హత చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి లాభదాయక పదవుల పరిధిలోకి రాదని ఆర్డినెన్స్‌లో కేంద్రం పేర్కొంది. దీంతో ఈ ఆర్డినెన్సు విజయసాయిరెడ్డి కోసం తెచ్చిందేనని అర్థమవుతోంది.
గత నెలలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించారు. లాభదాయక పదవుల పరిధిలోకి వస్తుందని రెండు రోజుల క్రితం ఆయన నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అయిన‌ప్ప‌టికీ విజ‌య‌సాయిరెడ్డి ఆ ప‌ద‌విలో 13 రోజులు ఉన్నారు.. దీంతో ఆయ‌న‌పై అన‌ర్హ‌త కత్తి వేలాడుతున్న‌ది.. ఈ ద‌శ‌లో చట్ట సవరణ ఆర్డినెన్స్‌తో విజయసాయిరెడ్డికి లైన్‌ క్లియరైంది.

కాగా ఇటీవల పార్లమెంటు సెంట్రల్ హాల్ నుంచి మోదీ బయటకు వస్తూ ఆ దారిలో కనిపించిన విజయసాయిరెడ్డిని ‘హాయ్ విజయ్’ అంటూ పలకరించి మాట్లాడడం.. దాన్ని విజయసాయిరెడ్డి హైలైట్ చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం ఆయన కోసం ఆర్డినెన్సు తేవడం చూస్తుంటే సాయిరెడ్డికి కేంద్రంలో జగన్ కంటే పట్టుందా అన్న చర్చ మొదలైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English