జ‌గ‌న్ టేబుల్ మీద ఆ ఒక్క‌ ప‌త్రికే మిస్?

జ‌గ‌న్ టేబుల్ మీద ఆ ఒక్క‌ ప‌త్రికే మిస్?

మాటంటే మాట‌. ఇష్టం లేదంటే ఇష్టం లేన‌ట్లే వ్య‌వ‌హారించ‌టం అంద‌రికి చేత‌కాదు. ఆ రెండు ప‌త్రిక‌లు చ‌ద‌వ‌నని అప్ప‌ట్లో చెప్పిన దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గురించి తెలిసిందే. త‌న మీద అదే ప‌నిగా నెగిటివ్ రాస్తే విరుచుకుప‌డే వైఎస్.. ఈ రెండు ప‌త్రిక‌లంటూ ఎద్దేవా చేసేవారు.

ఓవైపు ఆ మాట అంటూనే.. మ‌రోవైపు ఆ ప‌త్రిక‌ల్ని చ‌దివేవారు. నిజానికి పొగిడే వారి కంటే త‌ప్పులు ప‌ట్టే వారిని ఫాలో అయితే.. త‌మ‌లోని త‌ప్పుల్ని తెలుసుకోవ‌టంతో పాటు.. లోపాల్ని గుర్తించే వీలు ఉంటుంది. అయితే.. ఈ విష‌యంలో త‌న తండ్రిని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫాలో కావ‌టం లేద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కొచ్చిన ఒక ఫోటో స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి.

ప్ర‌తి విష‌యంలో నాన్న బాట‌లో న‌డిచే జ‌గ‌న్‌.. ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో మాత్రం త‌న‌దైన శైలిలోనే వెళుతున్నారే త‌ప్పించి.. వైఎస్ ను ఫాలో కావ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజాగా బ‌య‌ట‌కొచ్చిన జ‌గ‌న్ ఆఫీసులోని టేబుల్ మీద ఉన్న ప‌త్రిక‌ల్ని చూస్తే అర్థ‌మైపోతుంద‌ని చెబుతున్నారు.

సీనియ‌ర్ నేత దాడి వీర‌భ‌ద్ర‌రావుతో భేటీ సంద‌ర్భంగా తీసిన ఒక ఫోటో ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. సీఎం జ‌గ‌న్ టేబుల్ మీద పెద్ద ఎత్తున దిన‌ప‌త్రిక‌లు ఉన్నాయి. వాటిల్లో  అగ్ర ప‌త్రిక‌లు మొద‌లుకొని పెద్ద‌గా ప‌రిచ‌యం లేని దిన‌ప‌త్రిక‌లు ఉన్నాయి. ఇన్ని ఉన్నా.. తాను ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక మాత్రం లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. నిత్యం డ‌జ‌నుకు పైగా పేప‌ర్ల‌ను జ‌గ‌న్ చూస్తార‌న్న విష‌యం తాజా ఫోటో స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి.

ఇన్నిప‌త్రిక‌లు చూసినా.. తన‌ను అదే ప‌నిగా త‌ప్పు ప‌ట్టే ఆంధ్ర‌జ్యోతిని మాత్రం జ‌గ‌న్ చూడ‌ర‌న్న విష‌యం తాజా ఫోటో మ‌రోసారి స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ విధానాల మీద ఆంధ్ర‌జ్యోతి సాపేక్షంగా ఉంటూ ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఆ విష‌యం జ‌గ‌న్ కు అర్థం కావాలంటే ముందా ప‌త్రిక‌ను చూడాలిగా అన్న మాట‌లో నిజం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  అన్ని ప‌త్రిక‌లు చూస్తున్న జ‌గ‌న్‌.. త‌న‌ను త‌ప్పు ప‌ట్టే ప‌త్రిక చూస్తే.. విష‌యాలు కొత్త‌గా తెలిసే వీలుంద‌న్న ఆయ‌న స‌న్నిహితుల ఆఫ్ ద రికార్డు మాట ఆయ‌న‌కు ఎలా చేరుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English