బీజేపీలోకి టీడీపీ మాజీ లేడీ ఎమ్మెల్యే

బీజేపీలోకి టీడీపీ మాజీ లేడీ ఎమ్మెల్యే

టీడీపీ కంచుకోట అనంత‌పురం జిల్లాకు చెందిన ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి పార్టీలో కీల‌క ప‌ద‌విలో ఉన్నారు. ఆయ‌న‌కే పార్టీకి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న న‌మ్మ‌కం లేక కాషాయ కండువా క‌ప్పేసుకున్నారు. ఈ బాట‌లోనే ఇప్పుడు మ‌రో మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరిపోయారు. ఈ సారి వికెట్ మ‌హిళా మాజీ ఎమ్మెల్యేది కావ‌డం విశేషం. పైగా చంద్ర‌బాబు సొంత జిల్లాకు చెందిన ఆమె నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బాబుకు ఎంతో న‌మ్మ‌క‌స్తురాలిగా కూడా ఉన్నారు.

సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత తాజాగా బీజేపీ గూటికి చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌మ‌క్షంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలోని నాగలాపురం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రామూర్తిరెడ్డి గుంటూరులో క‌న్నాను క‌లిసి పార్టీ మారారు. హేమ‌ల‌తో 2009లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి రెండోసారి సీఎం అయిన‌ప్పుడు బ‌ల‌మైన కాంగ్రెస్ గాలుల‌ను ఎదుర్కొని కూడా ఎమ్మెల్యేగా గెలిచారు.

చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆమెకు సీటు ఇవ్వ‌లేదు. అయినా పార్టీ కోసం ఆమె అంకిత భావంతో ప‌నిచేశారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో అయినా సీటు వ‌స్తుంద‌ని ఆమె ఆశించ‌గా మ‌రోసారి నిరాశ ఎదురైంది. ఒకానొక ద‌శ‌లో సీటు ఇచ్చిన‌ట్టే ఇచ్చి మ‌రీ ఆమెకు షాక్ ఇచ్చారు. త‌న‌కు సీటు రాక‌పోయినా హేమ‌ల‌త మాత్రం స‌త్య‌వేడు టీడీపీ అభ్య‌ర్థి జేడీ రాజశేఖర్‌ గెలుపు కోసం కృషి చేశారు. తాజాగా ఎన్నిక‌లు అయిన వెంట‌నే బాబుకు షాక్ ఇస్తూ బీజేపీలో చేరిపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English