ఒక్క నెలలో 7 కోట్ల బీర్లు తాగేశారు

ఒక్క నెలలో 7 కోట్ల బీర్లు తాగేశారు

నెలకు ఏడో కోట్ల బీర్లా? ఈ నెంబరు చూసి దేశం మొత్తం ఇంత తాగారా అని అనుకుంటే మనవాళ్లను మీరు చాలా తక్కువ అంచనా వేసినట్లే.  కేవలం తెలంగాణలోని మందుబాబుల వేసవి దాహం ఇది. అవును వేసవి తాపం నుంచి బీర్లతో సేదదీరారు మందుబాబులు. మునుపు ఎన్నడూ లేనివిధంగా ఒక్క నెలలో (2019 మే) 7.32 కోట్ల బీర్లు తెలంగాణలో అమ్ముడయ్యాయి. ఇందులో అత్యధిక వాటా హైదరాబాదుదే. ఏప్రిల్‌ నెలలో 6.32 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఏకంగా కోటి బీర్లు ఎక్కువ తాగేశారన్నమాట.

మే సేల్స్ దేశంలోనే ఒక రికార్డు. ఏప్రిల్, మే రెండు నెలల్లో కేవలం బీర్ల అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.475 కోట్ల ఆదాయం వచ్చిందట. మొత్తం వేసవి లెక్కలు చూస్తే తెలంగాణ సర్కారు బీరు అమ్మకాల ఆదాయం 800 కోట్లు. జూన్లో కూడా వేడి తగ్గకపోవడంతో కొంచెం అటు ఇటుగా ఇదే హోరు ఉంటుందంటున్నారు.

బీరు అమ్మకాలు ఎందుకింత పెరుగుతున్నాయనడానికి అనేక కారణాలు చెబుతున్నారు. వేసవి తాపం ప్రధాన కారణం అన్నది నిజమే గాని బీరు గురించి ఇటీవల జరుగుతున్న ప్రచారం కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదం చేస్తోందట. మితంగా తాగితే బీరు ఒంటికి మంచిదే అన్న అభిప్రాయం జనాల్లో పెరిగిపోయింది. ఇందులో నిజమెంతో పక్కాగా నిర్దారణ కాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇది అందరికీ తెలిసింది. మహిళల్లో కూడా మందు తాగే వారి సంఖ్యా ఏటా పెరుగుతూ వస్తోంది. మందు అలవాటు చేసుకునే వారు మొదట బీరుతోనే మొదలుపెట్టడం వల్ల వీటి అమ్మకాలు ఎక్కువగా ఉండటానికి ఒక కారణం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English