నరసింహన్‌కు కేంద్రంలో కీలక పదవి.. తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

నరసింహన్‌కు కేంద్రంలో కీలక పదవి.. తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

సుదీర్ఘకాలంగా పదవిలో ఉన్న తెలుగు రాష్ట్రాల గవర్నరు ఈఎల్ నరసింహన్‌ మరికొద్దిరోజుల్లో మారనున్నారు. ఆయన్ను కేంద్ర హోంశాఖలో సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఇద్దరు గవర్నర్లను నియమించనున్నట్లు సమాచారం. కేంద్రం ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 26వ తేదీ ముగిసిన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చే అవకాశముంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల తన మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశమైనప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ కోసం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని సిద్ధం చేయాలని ఇప్పటికే ఏపీ సర్కార్‌కు సూచించారు.

ప్రస్తుత గవర్నర్ నరసింహన్ దాదాపు 11 సంవత్సరాల నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ ఇతర గవర్నర్ కూడా ఇంత కాలం గవర్నర్ పదవిలో కొనసాగలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగడం నరసింహన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేసుకునేందుకు పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో అందుకు ఉపయోగపడే ఇద్దరిని ఈ రాష్ట్ల్రాల్లో నియమిస్తారని తెలుస్తోంది.

ఇందుకోసం మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, కిరణ్ బేడీతో పాటు పలు ఇతర పేర్లను కూడా కేంద్ర హోంశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే... కిరణ్ బేడీ ఆసక్తిగా ఉన్నప్పటికీ సుష్మ ఆసక్తిగా లేరని సమాచారం. వీరితో పాటు విద్యాసాగరరావు, బీడీ మిశ్రా, లాల్జీ టాండన్‌ల పేర్లూ వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English