చంద్రబాబును వణికిస్తున్న రాంమాధవ్ మాటలు

చంద్రబాబును వణికిస్తున్న రాంమాధవ్ మాటలు

"ఏపీలో ఇప్పుడు మనమే ప్రతిపక్షం పాత్ర పోషించాల్సి ఉంది.. రానున్న రోజుల్లో హౌస్‌లో మనకు కొందరు సభ్యులు కూడా రాబోతున్నారు" అన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ మాటలతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉన్న కొద్ది పాటి ఎమ్మెల్యేలనూ బీజేపీ లాగేసుకుంటుందని ఆందోళన చెందుతున్నారట.

గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలను వెలికితీయడంతో పాటు దూకుడుగా వెళుతున్న ప్రస్తుత ప్రభుత్వ విధానాల లోపాలను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత మనపై ఉందని.. అందుకోసం, మనకు కొంతమంది ఎమ్మెల్యేలు త్వరలో రాబోతున్నారని రాంమాధవ్ పార్టీ నేతలతో చెప్పినట్లు సమాచారం. ఆదివారం ఆయన పార్టీ నాయకులతో సమావేశమై 2024 ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సిన వ్యూహా, ప్రతి వ్యూహాలపై చర్చించారు.

రానున్న రోజుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి భారీ ఎత్తున ప్రజాప్రతి నిధులు బీజేపీలోకి వలసలు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో జనసేన పార్టీ నుంచి కూడా కీలక నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న విషయాన్ని ఆయన నేతల వద్ద ప్రస్తావించారు. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చే వారు ఏ విధంగా వ్యవహరించా ల్సిఉంటుంది, ఇందుకు పార్టీ పరంగా తీసుకో వాల్సిన చర్యలు ఏంటి అనే దానిపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను ఆయన సేకరించినట్లు చెబుతున్నారు.

ఇప్పటికిప్పుడు ప్రతిపక్షమైన తెలుగుదేశం కోలుకునే పరిస్థితులు లేవని.. ఈ శూన్యత నుంచే బీజేపీ పార్టీని పటిష్టం చేయడానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా జలై 6 నుంచి ఆగష్టు 11 వరకు చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 శాతం సభ్యత్వ నమోదును పెంచాలంటూ రాష్ట్ర నేతలకు రామ్‌మాధవ్‌ దిశానిర్దేశం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English