టచ్ లో ఉన్న కాపు నేతలు- అటు బాబు... ఇటు బీజేపీ

టచ్ లో ఉన్న కాపు నేతలు-  అటు బాబు... ఇటు బీజేపీ

కాపు నేతలు పార్టీ వీడకుండా కాపాడుకోవడానికి చంద్రబాబు వారిని భేటీకి పిలవడం.. ఈ రోజు వారు చంద్రబాబును కలవనుండడం తెలిసిందే. అయితే.. కాపు నేతలు చంద్రబాబును కలవడానికి వస్తున్నా.. ఆయనతో పాటే బీజేపీ కీలక నేత ఒకరిని కూడా కలవబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు ఇటీవల విదేశాలకు వెళ్లినప్పుడు కాపు నేతల్లో కొందరు తోట త్రిమూర్తులు నేతృత్వంలో సమావేశమయ్యారు. వారంతా బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అనంతరం చంద్రబాబు విదేశాల నుంచి వచ్చిన వెంటనే వారితో సమావేశం ఏర్పాటు చేయగా ఎవరూ రాలేదు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వారంతా వస్తున్నారట. అయితే.. చంద్రబాబుతో సమావేశం తరువాత వారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ భేటీ అవుతారట.

చంద్రబాబు ఈ రోజు నుంచి గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. కాపు నేతలు కూడా అక్కడే ఆయన్ను కలుస్తున్నారు. అదేసమయంలో రాంమాధవ్ గత రెండు రోజులుగా గుంటూరులోని హాయ్ ల్యాండ్‌లో రహస్యంగా భేటీలు జరుపుతున్నారు. బీజేపీ నేతలతో సమావేశాలతో పాటు ఇతర పార్టీల నేతలతోనూ ఆయన సమావేశమవుతున్నారు. టీడీపీ కాపు నేతలు కూడా చంద్రబాబుతో భేటీ తరువాత రాంమాధవ్ దగ్గరకు వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, ఈ సమావేశం రహస్యంగా జరగబోతుందా.. లేదంటే వారు బహిరంగంగానే రాంమాధవ్‌ను కలుస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English