శ్రీనివాసా రాజీనామా చెయ్యొచ్చుకదా

శ్రీనివాసా రాజీనామా చెయ్యొచ్చుకదా

బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌పై ‘రాజీనామా’ ఒత్తిడి ఎక్కువవుతుండడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయడం తప్పకపోవచ్చునేమో. ఐపిఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదం, ఇండియాలో క్రికెట్‌కి చెడ్డ పేరు తెస్తున్నది. ఐపిఎల్‌ని బిసిసిఐ ప్రమోట్‌ చేయడాన్ని మాజీ క్రికెటర్లు ఎప్పుడో తప్పుపట్టారు. కాని కాసుల కోసం బిసిసిఐ ` ఐపిఎల్‌ని ప్రోత్సహిస్తుండడం ` స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదం తర్వాత ఇంకా వివాదాస్పదం అయ్యింది.

శ్రీనివాసన్‌ అల్లుడు అరెస్టు అయ్యేసరికి శ్రీనివాసన్‌ మీడియాని ఫేస్‌ చేయలేకపోతున్నారు. ‘మీడియా నన్ను వెంటాడుతున్నది’ అని మీడియాపై నోరు పారేసుకున్న శ్రీనివాసన్‌ రాజీనామా చేయాల్సిందేనని రాజకీయ నాయకులూ గళం విప్పుతున్నారు. నైతికత అనేదానికి అర్థం తెలిస్తే శ్రీనివాసన్‌ ఇప్పటికే రాజీనామా చేసి, మాజీ అయి ఉండేవారు. నైతిక విలువలనేవి లెక్క చేయక, ఆరోపణలు వచ్చినా లెక్కచేయని వారు ఎప్పటికైనా ఇబ్బందులు ఎదర్కోక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు