సచిన్, ధోని అభిమానుల మధ్య ముదిరిన వార్

సచిన్, ధోని అభిమానుల మధ్య ముదిరిన వార్

భారత క్రికెట్లో అత్యంత గొప్ప ఆటగాడు ఎవరు.. భారత క్రికెట్ ప్రగతికి అందరికంటే ఎక్కువ ఉపయోగపడిందెవరు అనే చర్చ వచ్చినపుడు సచిన్ తెందుల్కర్, మహేంద్రసింగ్ ధోనిల పేర్లు తెరమీదికి వస్తుంటాయి. ఇద్దరిలో ఎవరూ తక్కువ వాళ్లు కాదు. ఎవరి స్థాయిలో వాళ్లు భారత క్రికెట్ కోసం ఎంతో సేవ చేశారు. కానీ వీరి అభిమానులు మాత్రం తమ ఆటగాడు గొప్పంటే తమవాడు గొప్ప అంటూ వాదులాడుకుంటూ ఉంటారు. ఆశ్చర్యకరంగా ఈ మధ్య సచిన్, ధోని అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ తీవ్రమవుతోంది. తాజాగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ధోని నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై సచిన్ విమర్శలు గుప్పించడంతో ధోని అభిమానులకు మండిపోయింది. దీంతో సచిన్ బ్యాటింగ్‌లో లోపాలు వెతుకుతూ ట్వీట్లు మొదలుపెట్టారు. ఐతే సచిన్ అభిమానులు మాత్రం ఊరుకుంటారా.. ధోని గణాంకాలు బయటికి తీశారు.

ఒకరి మీద ఒకరు నిన్నట్నుంచి దుమ్మెత్తి పోసుకుంటున్నారు.సచిన్ కోసం ధోని 2011 ప్రపంచకప్ గెలిచాడని.. అతడి ఇన్నింగ్స్ వల్లే సచిన్ ప్రపంచకప్ కల నెరవేరిందని.. అలాంటి ఆటగాడిని విమర్శిస్తావా అని సచిన్ మీద ధోని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సచిన్ సెంచరీకి ముంగిట 90ల మీద ఉన్నపుడు ఎంత జిడ్డుగా ఆడేవాడో గుర్తు చేసి అతడి గాలి తీసే ప్రయత్నం చేశారు. ఐతే సచిన్ ఫ్యాన్స్ ఏమీ ఊరుకోలేదు. గత రెండు మూడేళ్లలో ధోని స్ట్రైక్ రేట్ ఎలా పడిపోయిందో.. ధోని ఎన్నిసార్లు తడబడ్డాడో గణాంకాలతో చూపించారు. ‘‘సచిన్‌ 2003 ప్రపంచకప్‌ పరుగులు 673. ధోని 2007, 2011, 2015, ప్రస్తుత టోర్నీలో అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ వరకు కలిపి 597 పరుగులు’ అని సచిన్ అభిమాని ఒకరు ట్వీట్‌ చేస్తే.. దీనికి బదులుగా ధోని అభిమాని ఒకరు ‘‘2003, 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచుల్లో సచిన్‌ మొత్తం పరుగులు 22. ఒక ప్రపంచకప్‌ ఫైనల్లో‌ ధోనీ పరుగులు 91’ అని కౌంటర్ ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English