జగన్ ... మీ పార్టీలో ఇలాంటి వాళ్లా - లోకేష్

జగన్ ... మీ పార్టీలో ఇలాంటి వాళ్లా - లోకేష్

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీడీపీ యువ‌నేత నారా లోకేష్ చేతిలో బుక్క‌య్యారా?  రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఘ‌ట‌న‌పై ఆదారాల‌తో స‌హా జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో ప‌డేశారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో సభ్యసమాజం తలదించుకొనే విధంగా దారుణ ఘ‌ట‌న జరిగి సంగ‌తి తెలిసిందే. పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న స్నేహితుడిని కలుసుకొనేందుకు ఆ బాలిక విజయవాడ నుంచి ఒంగోలు వచ్చింది. ఆమె స్నేహితుడు తమకు తెలుసని నమ్మించిన నలుగురు యువకులు ఒంగోలు బస్టాండ్ నుంచి ఆమెను తీసుకెళ్లారు. నాలుగు రోజులుగా ఓ గదిలో నిర్బంధించిన ఆ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ద‌ర్యాప్తు చేసి నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

అయితే, ఈ ఘ‌ట‌న‌పై ట్విట్ట‌ర్లో లోకేష్ ఘాటుగా స్పందించారు. 'ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు  వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు. @ysjagan గారూ, మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది.' అని జ‌గ‌న్‌ను ట్యాగ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో తాజా ఘ‌ట‌నలో రాక్ష‌సానికి పాల్ప‌డిన నిందితుడు జ‌గ‌న్‌తో సెల్ఫీ దిగిన ఫొటోను సైతం లోకేష్ ట్వీట్ చేశారు. ఆయ‌న ఫేస్‌బుక్ అకౌంట్లో జ‌గ‌న్ ఫొటోలు ఉన్న చిత్రాన్ని సైతం లోకేష్ పొందుప‌ర్చారు.

ఇదిలాఉండ‌గా, ఒంగోలులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ఆరా తీశారు. క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌మావేశంలో ప్రకాశం ఎస్పీ నుంచి జ‌గ‌న్ వివరాలు సేక‌రించారు. 24 గంటల్లోగా నిందితులను పట్టుకున్నామని ఎస్పీ పేర్కొన‌గా సీఎం అభినందనలు తెలిపారు. స‌ద‌రు బాధితురాలైన బాలిక‌కు పరిహారం ఇవ్వాలంటూ హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. రూ. 5లక్షల ప‌రిహారం ఇస్తామని హోంమంత్రి సుచరిత పేర్కొన‌గా పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English