ప్ర‌జావేదిక‌కూల్చివేత‌పై నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌

ప్ర‌జావేదిక‌కూల్చివేత‌పై నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌

ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఉన్న స‌మ‌యంలో ఉండ‌వ‌ల్లిలో నిర్మించిన ప్ర‌జావేదికను కూల్చివేయాలంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాలు ఇవ్వ‌టం.. బుధ‌వారం నాడు దాన్నికూల్చేయాల‌ని చెప్ప‌టం తెలిసిందే. అక్ర‌మ ప‌ద్ద‌తిలో నిర్మించిన నేప‌థ్యంలో ఆ క‌ట్ట‌డాన్ని కూల్చివేయాల‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ప‌లువురు జ‌గ‌న్ నిర్ణ‌యం స‌రైన‌దే అంటుంటే.. మ‌రికొంద‌రు కాద‌ని చెబుతున్నారు.

ఇలాంటివేళ టీడీపీ ఎంపీ కేశినేనినాని స్పందించారు. ఇటీవ‌ల కాలంలో త‌న‌దైన శైలిలో పెట్టిన ఫేస్ బుక్ పోస్టుల‌తో తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం సృష్టించిన ఆయ‌న‌.. తాజాగా ప్ర‌జావేదిక కూల్చివేత‌పై జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టారు. దీనిపై ఆయ‌న రియాక్ట్ అవుతూ.. ప్ర‌జావేదిక అక్ర‌మ‌మో.. స‌క్ర‌మ‌మో అన్న‌ది ప‌క్క‌న పెడితే.. అది ప్ర‌జాధ‌నంతో నిర్మించిన క‌ట్ట‌డ‌మ‌ని.. అలాంటివేధిక‌ను తొల‌గించే ముందు.. అక్ర‌మ నిర్మాణ‌ల‌న్ని తొల‌గించిన త‌ర్వాతే ప్ర‌జావేదిక‌ను తొల‌గించాల‌న్నారు.

దీనిపై కేశినేని నాని పెట్టిన పోస్టును య‌థాత‌ధంగా చూస్తే..

ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక.

కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన పిదప, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని నా అభిప్రాయం.

ఇప్పుడు తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలా నష్టం :-

1) ప్రజావేదికను ప్రజాధనంతో నిర్మించడం జరిగింది. కాబట్టి ఆ సొమ్ము వృథా అవుతుంది.

2) మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుంది.

కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుందని నా అభిప్రాయమ‌ని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English