లైవ్ లో కొట్టుకున్నారు.. అయినా కంటిన్యూ చేశారు

లైవ్ లో కొట్టుకున్నారు.. అయినా కంటిన్యూ చేశారు

ఒక న్యూస్ చాన‌ల్ లో మ‌న‌కు మాదిరే చ‌ర్చా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అది కాస్తా దారి త‌ప్పింది. చ‌ర్చ‌లో పాల్గొన్న అధికార పార్టీ నేత‌కు.. క‌రాచి ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడికి మ‌ధ్య హాట్ హాట్ గా చ‌ర్చ న‌డిచింది. ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్న ప్రెస్ క్ల‌బ్ అధ్యక్షుడి తీరుతో మంట పుట్టిన స‌ద‌రు నేత మాట‌ల్ని వ‌దిలేసి చేత‌ల్లో త‌న ప్ర‌తాపాన్ని ప్ర‌ద‌ర్శించిన వైనం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతంలోకి వెళితే..

పాకిస్థాన్ లోని ఒక న్యూస్ చాన‌ల్ నిర్వ‌హించిన న్యూస్ లైన్ విత్ అప్తాబ్ ముఘేరి డిబెట్ కు పాక్ అధికార ప‌క్షం పాకిస్తాన్ తెహ్రీక్ -ఎ- ఇన్సాఫ్ నేత మ‌సూర్ అలీ సియాల్ హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు క‌రాచి ప్రెస్ క్ల‌బ్ అధ్యక్షుడు ఇమ్తియాజ్ ఖాన్ లు ముఖ్యఅతిధులు ఉన్నారు. వీరిద్ద‌రితో పాటు మ‌రొక‌రు ఉన్నారు.

చ‌ర్చ సంద‌ర్భంగా నేత‌కు.. ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడికి మ‌ధ్య వాద‌న‌లు హాట్ హాట్ గా మారాయి. ప్ర‌భుత్వం తీరును త‌ప్పు ప‌డుతూ.. ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్న ఇమ్తియాబ్ ఖాన్ మాట‌ల‌తో స‌హ‌నం కోల్పోయారు మ‌సూర్ అలీ. వెంట‌నే లేచిన అత‌డు ఇమ్తియాజ్ మీద దాడికి దిగారు. దీంతో ఆయ‌న కింద‌కు ప‌డిపోయారు. లేచి.. స‌ద‌రు నేత‌పై ప్ర‌తిదాడికి దిగారు. దీంతో వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మారింది.

అయిన‌ప్ప‌టికీ టీవీ లైవ్ ఆప‌క‌పోవ‌టం ఒక విశేష‌మైతే.. ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడు లైవ్ నుంచి వెళ్లిపోగా.. ఆయ‌న ప్లేస్ లో మ‌రొక‌రిని తీసుకొచ్చారు. స‌ద‌రు నేత మాత్రం డిబేట్ కు సిద్ధ‌మ‌య్యారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా లైవ్ కంటిన్యూ కావ‌టం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై పాక్ కు చెందిన మ‌హిళా జ‌ర్న‌లిస్టు ఒక‌రు స్పందిస్తూ.. దాడి చేయ‌ట‌మే న‌యా పాకిస్తాన్ అంటూ ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. అదిప్పుడు వైర‌ల్ అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English